మన భారత తపాలా శాఖ వారు 19-09-2024న పద్మ విభూషణ్ మరియు దాదాసాయెబ్ అవార్డు గ్రహీత డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక ప్రత్యేక స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఈ తపాలా బిళ్ళపై ముద్రించిన అక్కినేని ఛాయా చిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు, సినిమా దర్శకుడు బాపు గారు రూపొందించారు. ఇది అక్కినేని ఇష్టమైన చిత్రం.
పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు |
First Day Cover - పద్మ విభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు |
తెలుగు ప్రఖ్యాత తెలుగు చలన చిత్ర నటుడు, నటసామ్రాట్ , దాదాసాయబ్ ఫాల్కే అవార్డు గ్రహీత , పద్మ విభూషణ్ డా. అక్కినేని నాగేశ్వర రావు (20 September 1924 – 22 January 2014) గారు. వీరు తన 70 ఏళ్ల సినీ జీవితంలో 244 చిత్రాలలో నటించి తెలుగు వెండి తెరపై తేజోవంతమైన తారగా, మరో ధృవతార ఎన్టీఆర్ తో పాటు తెలుగు చిత్రసీమకు మూలపురుషులుగా కీర్తి గడించారు. చిత్ర సీమలో అక్కినేని అందుకొని శిఖరాలు లేనేలేవు. ప్రేమ కథాచిత్రాలకు, భక్తి రస ప్రధాన చిత్రాలకు జీవం పోశారు. స్వయంకృషికి, క్రమశిక్షణకు మారుపేరు. దైవ భావన కంటే మానవ భావన గొప్పదని భావించిన తత్వజీవి అక్కినేని.
Comments