యునెస్కో వారిచే వారసత్వ ప్రదేశాల గుర్తింపు పొందిన ప్రదేశాలు మన దేశంలో ఇప్పటివరకు 38 ఉన్నాయి. ఈ జాబితాలో అత్యధిక ప్రదేశాలు ఉన్న దేశాలలో మన దేశం 6 వ స్థానంలో ఉన్నది. వాటిలో ప్రముఖమైన నాలుగు ప్రదేశాలపై మన తపాలా శాఖ ఒక మినియేచర్ ను ఐదు తపాలా బిళ్లలతో మార్చి 16, 2020న విడుదల చేసింది.
1. Manas Wildlife Sanctuary,
2. Great Himalayan National Park,
3. Nanada Devi and Valley of Flowers National Parks,
4. Western Ghats
ఇంతకు ముందు UNESCO World Heritage Sites in India-1, పేరుతో యునెస్కో గుర్తింపు పొందిన రాజస్థాన్ రాష్ట్రంలో గల చారిత్రాత్మక కట్టడాలపై మన తపాలా శాఖ వారు 29-12-2018 న 6 తపాలా బిళ్లలతో ఉన్న ఒక మినియేచర్ ను విడుదల చేసింది.
దీనిపై రాజస్థాన్ లో గల కోటలు - కుంభాల్ ఘర్, చిత్తోర్ ఘర్, జైసల్మేర్ , గగ్రోన్, రతంబోర్, అజ్మీర్ హిల్ ఫోర్ట్ లు చోటుచేసుకున్నాయి.
Comments