Skip to main content

ఒంగోలు గిత్త

Special cover on Ongole Bull 
by India Post on 18-09-1993, on the occasion of APPX'93,at Vijayawada 

ప్రపంచంలోనే పేరెన్నిక గన్న పశువుల జాతి మన ఒంగోలు జాతి. ఒంగోలుకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన జాతి ఇది. ఇవి బలిష్టమైన కాయంతో, చూడముచ్చటైన రూపంతో ఉంటాయి. కష్టతరమైన దుక్కి దున్నడం వంటి పనులకు ఒంగోలు జాతి గిత్త బాగా అనువైనది.
ఒంగోలు జాతి పశువులు ఆకారంలో చాలా పెద్దవిగాను, బలిష్టంగాను ఉంటాయి. చక్కగా మచ్చిక అయ్యే గుణం కలిగి, బండి లాగుడుకు అంతో అనుకూలంగా ఉంటాయి. ఒంగోలు ఎద్దులు ఆకారంలోను, కొమ్ములలోను విలక్షణంగా ఉండి చూడగానే గుర్తించేలా ఉంటాయి. కొమ్ములు కురచగా - 3 , 6 అంగుళాలు - ఉండి బయటి వైపుకు పొడుచుకు వచ్చి ఉంటాయి.విశాలమైన కాళ్ళు, చిన్న మొహం, వెడల్పాటి నుదురు, పెద్ద చెవులు కలిగి ఉంటాయి. ఒంగోలు ఎద్దులో మరో ప్రముఖమైన అంశం దాని అందమైన మూపురం. మూపురం పెద్దదిగా ఉండి, నడిచేటపుడు అటూఇటూ ఒరిగిపోతూ ఉంటుంది.
 INDIGENOUS BREEDS OF CATTLE
KANKREJ
KANGAYAM 
GIR
HALLIKAR
బాస్ ఇండికస్ (Bos indicus) అనే పశువుల కుటుంబానికి భారత ఉపఖండం నిధి వంటిది. వ్యవసాయ పనులకు గాని, పాలు, మాంసానికి గాని ఈ జాతి పశువులు ప్రశస్తమైనవి. నేల, వాతావరణం, దొరికే గ్రాసం వంటి వాటిని బట్టి ఈ కుటుంబంలో 30 వరకు వివిధ జాతుల పశువులు అభివృద్ధి చెందాయి. వీటి పేర్లు ఆయా ప్రదేశాల పేర్లను బట్టి వచ్చాయి.
ఈ జాతుల్లో  కంక్రేజ్, గిర్, కంగాయం,హల్లికర్,ఒంగోలు, మైసూరు,సింధీ, సహివాల్,  హిస్సార్,  జాతులు ప్రపంచంలోని అనేక సమశీతోష్ణ దేశాలకు వ్యాపించాయి. ఈ తొమ్మిది జాతుల్లోనూ, ఒంగోలు జాతి అనేక దేశాల్లోను, వివిధ ఖండాల్లోను అత్యధికంగా వ్యాపించింది.
 అయితే తపాలా శాఖా వారు INDIGENOUS BREEDS OF CATTLE అనే పేరుతో 25 -04 -2000 లో నాలుగు తపాల బిళ్ళలను విడుదల చేసింది. వాటిలో కంక్రేజ్గిర్, కంగాయం,హల్లికర్ అనే వాటికి చోటు కలిగించి, మన ఒంగోలు గిత్తను వదిలి పెట్టారు. ఇలా విడుదల చేసిన వాటిలో మన దక్షిణ భారత్ కు ఎప్పుడు తమిళనాడు మాత్రమే ప్రతినిధి గా ఎంచటం, వారి కి ప్రాముఖ్యతను కల్పించటం మామూలే. 

Comments

aravind Joshua said…
so they didn't release a stamp on "ongole gitta". did they?
kodali srinivas said…
ఒంగోలు గిత్త పై స్టాంపు లేదండి, ప్రపంచ ప్రసిద్ది చెందిన మన ఒంగోలు జాతి గిత్తలను వదిలి అరవాళ్ళ 'కంగాయం' కు తపాల బిళ్ళ పై చోటు కలిపించారు. ఇది మామూలే. ఇంతకు ముందు మన దేశపు పెళ్లి కుమార్తెలు పేరుతో నాలుగు తపాల బిళ్ళలు విడులైనప్పుడు,మన దేశపు గిరిజనులు పై నాలుగు తపాల బిళ్ళలు విడులైనప్పుడు కుడా తెలుగు వారికి ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇది మన స్థితి.

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

ప్రముఖ పారిశ్రామిక వేత్త , విద్యావేత్త ఆచార్య పి. ఆర్. రామకృష్ణ

ప్రముఖ పారిశ్రామిక వేత్త , విద్యావేత్త ఆచార్య పి. ఆర్. రామకృష్ణ శత జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవరు 29-03-2018 న కోయంబత్తూరు లో విడుదల చేసారు.  A special cover on Prof. P.R. Ramakrishnan A special cover on Prof. P.R. Ramakrishnan was issued by India Post on 29th March, 2018 on his Birth centenary celebrations. Prof. P R RAMAKRISHNAN , Son of Shri V. Rangaswamy Naidu; born in Peelamedu, Coimbatore on October 11, 1917; educated at Madras University. A post-graduate in electrical engineering from the Massachusetts Institute of Technology (USA) Mr. Ramakrishnan had worked in the General Electric Company in the U.S. for seven years. P. R. Ramakrishnan was the first Indian Alumni of MIT Sloan School of Management and a graduate of Massachusetts Institute of Technology, United States who founded Madras Aluminum Company, South India Viscose, Coimbatore Institute of Technology and many other textile industries and two time Member of Parliament representing Indian National Congress fr...