Special cover on Ongole Bull
by India Post on 18-09-1993, on the occasion of APPX'93,at Vijayawada
ప్రపంచంలోనే పేరెన్నిక గన్న పశువుల జాతి మన ఒంగోలు జాతి. ఒంగోలుకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన జాతి ఇది. ఇవి బలిష్టమైన కాయంతో, చూడముచ్చటైన రూపంతో ఉంటాయి. కష్టతరమైన దుక్కి దున్నడం వంటి పనులకు ఒంగోలు జాతి గిత్త బాగా అనువైనది.
ఒంగోలు జాతి పశువులు ఆకారంలో చాలా పెద్దవిగాను, బలిష్టంగాను ఉంటాయి. చక్కగా మచ్చిక అయ్యే గుణం కలిగి, బండి లాగుడుకు అంతో అనుకూలంగా ఉంటాయి. ఒంగోలు ఎద్దులు ఆకారంలోను, కొమ్ములలోను విలక్షణంగా ఉండి చూడగానే గుర్తించేలా ఉంటాయి. కొమ్ములు కురచగా - 3 , 6 అంగుళాలు - ఉండి బయటి వైపుకు పొడుచుకు వచ్చి ఉంటాయి.విశాలమైన కాళ్ళు, చిన్న మొహం, వెడల్పాటి నుదురు, పెద్ద చెవులు కలిగి ఉంటాయి. ఒంగోలు ఎద్దులో మరో ప్రముఖమైన అంశం దాని అందమైన మూపురం. మూపురం పెద్దదిగా ఉండి, నడిచేటపుడు అటూఇటూ ఒరిగిపోతూ ఉంటుంది.
INDIGENOUS BREEDS OF CATTLE
KANKREJ |
KANGAYAM |
GIR |
HALLIKAR |
బాస్ ఇండికస్ (Bos indicus) అనే పశువుల కుటుంబానికి భారత ఉపఖండం నిధి వంటిది. వ్యవసాయ పనులకు గాని, పాలు, మాంసానికి గాని ఈ జాతి పశువులు ప్రశస్తమైనవి. నేల, వాతావరణం, దొరికే గ్రాసం వంటి వాటిని బట్టి ఈ కుటుంబంలో 30 వరకు వివిధ జాతుల పశువులు అభివృద్ధి చెందాయి. వీటి పేర్లు ఆయా ప్రదేశాల పేర్లను బట్టి వచ్చాయి.
ఈ జాతుల్లో కంక్రేజ్, గిర్, కంగాయం,హల్లికర్,ఒంగోలు, మైసూరు,సింధీ, సహివాల్, హిస్సార్, జాతులు ప్రపంచంలోని అనేక సమశీతోష్ణ దేశాలకు వ్యాపించాయి. ఈ తొమ్మిది జాతుల్లోనూ, ఒంగోలు జాతి అనేక దేశాల్లోను, వివిధ ఖండాల్లోను అత్యధికంగా వ్యాపించింది.
అయితే తపాలా శాఖా వారు INDIGENOUS BREEDS OF CATTLE అనే పేరుతో 25 -04 -2000 లో నాలుగు తపాల బిళ్ళలను విడుదల చేసింది. వాటిలో కంక్రేజ్, గిర్, కంగాయం,హల్లికర్ అనే వాటికి చోటు కలిగించి, మన ఒంగోలు గిత్తను వదిలి పెట్టారు. ఇలా విడుదల చేసిన వాటిలో మన దక్షిణ భారత్ కు ఎప్పుడు తమిళనాడు మాత్రమే ప్రతినిధి గా ఎంచటం, వారి కి ప్రాముఖ్యతను కల్పించటం మామూలే.
Comments