A Special cover Issued by India Post on
Timmamma Marrimanu (The Largest Banyan Tree),Ananthapur Dist.A.P.
on 23-2-2002 with Special Cancellation of Lepakshi Nandi.
అనంతపూర్ లో 23-2-2002 న జరిగిన' RAYALAPEX ' సందర్బంగా మన తపాల శాఖ వారు ఒక ప్రత్యక కవరు విడుదల చేసారు. లేపాక్షి నంది బొమ్మతో ప్రత్యక పోస్టల్ ముద్ర తోవిడుదల చేసిన ఈ కవరు పై ప్రపంచ ప్రసిద్ది చెందిన తిమ్మమ్మ మర్రి మాను చిత్రాన్ని ముద్రించారు.
తిమ్మమ్మ మర్రిమాను
ఈ మర్రి చెట్టు కదిరి పట్టణానికి 35 కి.మీ మరియు అనంతపురం నగరానికి 100 కి.మీ దూరం లో, గూటిబయలు గ్రామంలో ఉన్నది. దక్షిణ భారత దేశంలోఅతి పెద్ద వృక్షం గా పేరు పొందింది. ఈ మర్రి చెట్టు దాదాపు 5 చదరపు ఎకరములు కన్న ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి యున్నది.1989 లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది.
తిమ్మమ్మ అనే ఆమె 1394 లో శెన్నాక్క వేంకటప్ప మరియు మంగమ్మ లకు జన్మించింది.భర్త మరణించటం తో ఆమె 1434 లో సతీ సహగమనం చేసింది. ఆ చితి పై ఉన్నఈ చెట్టుకు తిమ్మమ్మ అను పేరు పెట్టారు. ఈ చెట్టు క్రింద తిమ్మమ్మ గుర్తుగా చిన్న గుడి వుంది.
ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది.
లేపాక్షి, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో దేశం లో కెల్లా అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఉంది. ఠీవిగా కూర్చున్న ఈ నంది విగ్రహాన్ని లేపాక్షి బసవన్నగా పిలుస్తుంటారు.
ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్య యుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడకూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తువరకొ కల పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్థంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి.
Comments