India Post relased a set of four Commemorative postage stamps on CENTENARY OF THE INDIAN NATIONAL CONGRESS on 28-12-1985,
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి వంద వసంతాలు నిండిన సందర్భంగా 1985 లో నాలుగు (se-tenant) స్టాంప్స్ విడుదల చేసారు.
నూరు సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో ఆ పార్టీ కి అద్యక్షత వహించిన మన తెలుగు ప్రముఖుల చిత్రాలు వీటిలో ఉన్నాయి.
1.పి .ఆనందాచార్యులు. (1843-1908) : 1891 లో అధ్యక్షులు (పైన ఎడమ ప్రక్క మొదటి స్టాంపులో -మూడో వరుస,మూడో బొమ్మ)
2.భోగరాజు పట్టాభి సీతారామయ్య (1880-1959): 1948,49 లో అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో - మొదటి వరస ,మూడోది)
3.నీలం సంజీవరెడ్డి (1913-1996) 1960-63 లో అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో- రెండవ వరస,మూడోది )
4. దామోదరం సంజీవయ్య (1921-9171); 1962-64,1971-72 లలో రెండు సార్లు అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో- రెండవ వరస,నాలుగోది)
5. కాసు బ్ర హ్మా నంద రెడ్డి (1914-1994): 1978-79 లో అధ్యక్షులు (క్రింది కుడి ప్రక్క నాలుగో స్టాంపులో - చివరి వరుసలో మూడోది)
వీరిలో పట్టాభి సీతారామయ్య గారికి, దామోదరం సంజీవయ్య గారికి, బ్రహ్మానంద రెడ్డి గారికి ప్రత్యేక తపాల బిళ్ళలు విడుదల చేసారు.
Comments