A Commemorative postage stamp on
19 -12 - 1995
యల్లాప్రగడ సుబ్బారావు(1895-1948) భారత దేశమునకు చెందిన వైద్య శాస్త్రజ్ఞులలో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. వారి జన్మ స్థలం నేటి పచ్చిమ గోదావరి జిల్లా ,భీమవరం.
హార్వర్డ్ స్కూల్ అఫ్ ట్రాపికల్ మెడిసిన్నుండి డిప్లొమా పొందిన తర్వాత, హార్వర్డ్ లో తనకు ఆచార్య పదవి తిరస్కరించడము వలన ఈయన లెద్రలే ప్రయోగశాలలో చేరాడు. ఈయన రూపొందించిన హెట్రజాన్ అను డ్రగ్ పైలేరియాసిస్ (బోదకాలు వ్యాధి) నివారణకు ఉపయోగించబడినది. సుబ్బారావు గారి పర్యవేక్షణలో బెమ్జిమిన్ డుగ్గర్1946 లో ప్రపంచములోనే మొట్టమొదటి టెట్రాసైక్లిన్ అయిన ఆరియో మైసిన్ అనే మందు కనుగొనెను. సుబ్బారావు యొక్క పరిశోధనలను వెలుగు చూడనీయక పోవడము వలన వారు కనుగొనిన కొన్ని మందులను అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చినది.
కొత్తగా కనుగొనిన ఒక ఫంగస్ కు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (Subbaromyces splendens) అని నామకరణము చేశారు.1947 లో అమెరికా పౌరసత్వమునకు అర్హత పొందినా సుబ్బారావు తన జీవితాంతము భారతీయ పౌరునిగానే మిగిలిపోయాడు. తన జీవితమును మొత్తము వైద్య శాస్త్ర పరిశోధనకు అంకితము చేశాడు.మన తెలుగు వారు గర్వించ దగ్గ మహా వ్యక్తి .వీరి గౌరవార్దం 19-12-1995 లో ఒక తపాల బిళ్ళ విడుదలఅయింది.
Comments