ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల రాజధాని మన హైదరాబాద్ నగరము. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, ప్రముఖ చరిత్రకు, కట్టడాలకు, మసీదులకు, దేవాలయములకు, చక్కని కళలకు ప్రసిద్ది. దేశంలో ఐదవ అతిపెద్ద మహానగరము.హైదరాబాదును మూసీ నది ఒడ్డున క్రీ.శ. 1590 లో కులీ కుతుబ్ షా నిర్మించాడు. 400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన అతి గొప్ప నగరమది. కలరా వ్యాధి నుండి రక్షణ ఇస్తుందనే నమ్మకం తో 1591లో చార్మినార్ నిర్మించాడు. ఆ తర్వాత 1594లో నాల్గవ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట నగరం నిర్మించాడు.కుతుబ్ షా ప్రియురాలు భాగమతి పేరుతొ దీనికి భాగ్య నగరం అనే పేరు కుడాఉంది.ఈ నగర ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ 'సిటీస్ అఫ్ ఇండియా' పేరుతొ 24 -12 - 1900 న ఒక తపాల బిళ్ళ విడుదల చేసింది. ఈ స్టాంపుతో పాటు బికనేర్, కటక్ నగరాల స్టాంపులు కుడా విడులైయ్యాయి.
చార్మినార్, గోల్కొండ కోట, లంబాడి (బంజారా తెగ ) స్త్రీ తో నగర సంస్కృతి ని చూపించే ఈ తపాల బిళ్ళ వెల ఐదు రూపాయలు.
చార్మినార్, గోల్కొండ కోట, లంబాడి (బంజారా తెగ ) స్త్రీ తో నగర సంస్కృతి ని చూపించే ఈ తపాల బిళ్ళ వెల ఐదు రూపాయలు.
Comments