దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు (1867-1938) ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంధాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను'కళా ప్రపూర్ణ' బిరుదుతో సత్కరించింది. ఆంధ్ర ప్రత్రిక, అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించాడు. ఆంధ్రపత్రిక,భారతి , ఆంధ్ర గ్రంధాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశనుండీ నాయకులుగా ఉన్నవారిలో నాగేశ్వరరావు ఒకడు. ఈ విషయమై తన పత్రికలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు.శ్రీ భాగ్ వడంబిక వీరి నివాసం లోనే కుదిరింది. తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన విషయాలలో ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు ఆయనను 'దేశోధ్ధారక' బిరుదుతో సత్కరించారు.వీరి గౌరవార్దం 1-5-1969 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల అయింది.
9 -8 - 1976 లో ఇన్ ల్యాండ్ కవర్ పై అమృతాంజన్ వారి వ్యాపార ప్రకటన
9 -8 - 1976 లో ఇన్ ల్యాండ్ కవర్ పై అమృతాంజన్ వారి వ్యాపార ప్రకటన
Comments