First Day Cover -K. Bramhananda Reddy |
కాసు బ్రహ్మానందరెడ్డి 102 వ జయంతి సందర్బం గా మన తపాలా శాఖ 28- 7- 2011 న ఒక ప్రతేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
KASU BRAHMANANDA REDDY
శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి 1909 జూలై 28 న గుంటూరు జిల్లా నరసావురావు పేట సమీపాన తూబాడు గ్రామంలో జన్మించారు. మదరాసు పచయప్ప కళాశాలలో పట్టా, పిమ్మట న్యాయ పట్టా పుచ్చుకున్నారు. ఉమ్మడి మదరాసు రాష్ట్రంలో మొదటి సారిగా 1946 లో శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1946 నుండి 1952 వరకు 1952 నుండి 1972 వరకు శాసన సభకు ఎన్నికైనారు. 1952నుండి 1956 వరకు రాష్ట్ర కాంగ్రెస్ కమీటికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత పురపాలక శాఖ మంత్రిగా వాణిజ్య శాఖ, ఆర్ధిక శాఖలు నిర్వహించారు.
1964వ సంవత్ఫరం ఫిబ్రవరి 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అప్పటి తెలంగాణా ఉద్యమం సెగతో వారు 1971 సెప్టెంబర్ 15న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
కేంద్రమంత్రి వర్గంలో 1974 వ సంవత్సరంలో భాద్యతలు చేపట్టి కమ్యూనికేషన్, హోం, పరిశ్రమల శాఖలను నిర్వహించారు.
1977లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఆ సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధార్థ శంకర్ రే పై పోటీచేసి విజయం సాధించారు. తదనంతరం ఇందిరాగాంధీతో విభేదాలు తలెత్తాయి. ఆమెను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో కాంగ్రెస్ నిట్టనిలువునా చీలింది. ఒక వర్గానికి ఇందిరాగాంధీ నాయకత్వం వహించగా మరో వర్గానికి కాసు సారథ్యం వహించారు. ఆయన నేతృత్వంలోని పార్టీ రెడ్డి కాంగ్రెస్ గా రూపాంతరం చెందింది. 1978లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధి ఘన విజయం సాధించింది. దానితో రెడ్డి కాంగ్రెస్ 1980లో ఇందిరాకాంగ్రెస్‌లో విలీనం చేశారు. బ్రహ్మానందరెడ్డి 1994 మే 20 న హైదరాబాద్ లో మరణించారు.
Comments
Please visit my blog at
www.indianpostmarks.blogspot.com