A Commemorative postage stamps on
Astrological Signs
14 - 04 - 2010
Astrological Signs
14 - 04 - 2010
విజ్ఞానం ఎంత పెరిగినా జ్యోతిష్యానికి ఆదరణ లభిస్తూనే ఉంది. దాన్ని ఆవకాశం గా తీసుకుని డబ్బు దండుకునే వారి కోవలోకి మన తపాల శాఖా కుడా చేరింది. ఆకాశం లో కనిపించే నక్షత్రాలను మన పూర్వికులు 12 రాశులుగా విభాగించి వాటికి ... మేషం, వృషభం,మిధునం,కర్కాటం,సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీనం ...అనే పేరులతో పిలుస్తూవాటిని బట్టి మన జాతకాలను చెప్పేవారు. ఈ నాటికి వీటిని విశ్వసించే వారు చాల మంది ఉన్నారు. ఈ నక్షత్ర రాశులనువివిధ దేశాల వారు వివిధ పేరులతో పిలుస్తున్నారు.ఈ జ్యోతిష్య చిహ్నాలను చాల దేశాలు తపాల బిళ్ళల పై ముద్రించారు. మన తపాల శాఖా మన గ్రామీణ ప్రాంతాలలోప్రాచుర్యం పొందిన ఈరాసుల బొమ్మలను నాలుగు రంగులతో 12 తపాల బిళ్ళల పై ముద్రించారు. ఇలా ఒక అంశం పై ఒకే సారి 12 స్టాంపులు విడుదల చేయటం ఇదే ప్రధమం.ఈ 12 తపాల బిళ్ళను ఒకే షీటు లో ఉండే లా అందమైన ఒక మినియేచార్ కుడా విడుదల చేసారు.ప్రతి తపాల బిళ్ళ వెల 5/- రూపాయలు. మినియేచార్ వెల 60/- రూపాయలు.
Comments