A commemorative postage stamp of Durgabai on 9-5- 1982
చట్ట సభలలో ౩౩ శాతం మహిళా రిజర్వేషన్స్ అమల జరగబోతున్న శుభ సమయాన మన తెలుగు మహిళ శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారిని మననం చేసుకుందాం.
దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) పేరు పొందిన తెలుగు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. 1909లో కాకినాదలో జన్మించిన దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై గాంధీజీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పని చేస్తూ నెహ్రుజీ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. సంఘ సంస్కర్తగా బాల్య వివాహము, వరకట్నం వంటి దురాచారాలపై పోరాడింది. ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని అరెస్టు కాబడింది. ఈమె ఆధ్వర్యంలో 1937లో చెన్నైలో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది.భారత రాజ్యాంగ నిర్మాణ సభలో 1946 నుండి 1950 వరకు సభ్యురాలిగా పని చేసిన పిమ్మట, 1952లో ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా పని చేసారు. ఆ సందర్భములో సి.డి. దేశముఖ్ తో కలిగిన పరిచయం పరిణయానికి దారి తీసింది.
ప్రతేక తపాల బిళ్ళ విడుదల చేసారు.
1975 - లో పద్మ విభూషణ్ పురస్కరాన్ని పొందారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి
గౌరవ డాక్టరేట్, 1971 -లో నెహ్రూ లిటరసీ అవార్డు, యునెస్కో నుండి పాల్ జి. హాఫ్‌మన్ అవార్డు పొందారు.
శ్రీమతి దుర్గాబాయి దేశముఖ్ గౌరవార్దం తపాల శాఖా వారు వారి ప్రధమ వర్ధంతి న (9-5- 1982) గౌరవ డాక్టరేట్, 1971 -లో నెహ్రూ లిటరసీ అవార్డు, యునెస్కో నుండి పాల్ జి. హాఫ్‌మన్ అవార్డు పొందారు.
ప్రతేక తపాల బిళ్ళ విడుదల చేసారు.
Comments