A commemorative postage stamp of SHYAMA SHASTRI ON 21 - 12 - 1985
శ్రీ శ్యామశాస్త్రి (1762 -1827 ) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో( త్యాగయ్య, ముత్తు స్వామి దీక్షితులు ) మూడవ వాగ్గేయ కారుడు.తమిళనాడు లోని తిరువారూరు గ్రామస్థుడు.
శ్యామశాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము, ముద్దుగాశ్యామకృష్ణా యని పిలిచేవారు. అదే ఈయన కృతుల లో ఈయన ముద్ర అయినది. ఈయన కామాక్షి దేవి ఉపాసకుడు.ఆ దేవత పై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వరాగములను కల్పించాడు. తెలుగు,సంస్కృతభాషా కోవిదుదైన ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించుకామాక్షి, కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారుడైన సుబ్బరాయ శాస్త్రి వీరి కుమారుడే.
వీరి గౌరవార్దం 1985 , డిసెంబర్ 21 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.

Comments