A Commemorative postage stamp on
5- 9 - 2006
L.V.PRASAD
5- 9 - 2006
L.V.PRASAD
ఎల్.వి.ప్రసాద్ (1908 -1994) గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత . ఈయన జనవరి 17,1908న ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. హిందీ,తమిళ,తెలుగు,కన్నడ పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా ,కాళిదాస్ భక్త ప్రహ్లాద మూడింటిలోనూ నటించిన ఘనత శ్రీ ఎల్.వి గారిదే . ఎల్వీ ప్రసాదు స్మారకార్థం భారత తపాల శాఖ 2006 సెప్టెంబర్ 5 న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
Comments