13 - 3 - 2000
Dr.BURGULA RAMAKRISKNA RAO
బూర్గుల రామకృష్ణారావు (1899 - 1967 ) మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం లోని పడకల్ గ్రామంలో జన్మించాడు. ఇంటిపేరు పుల్లంరాజు . అయితే తన స్వగ్రామమైన బూర్గుల పేరుమీదుగా రామకృష్ణారావు బూర్గుల అని ప్రసిద్ధుడై, బూర్గుల ఆయన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టి తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు.
1948 లో పోలీసు చర్య అయి, సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. 1952 లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసారు.
ఆ తరువాత 1956 లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి , ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడింది.విశాల ఆంద్ర కొరకు ముఖ్య మంత్రి పదవిని త్యాగంచేసిన బూర్గుల 1960 వరకు కేరళ గవర్నరుగా పనిచేసి, తరువాత 1962 వరకు ఉత్తర ప్రదేశ్ కు గవర్నరుగా పనిచేసాడు. 1967 సెప్టెంబర్ 14 న మరణించాడు.
డా.బూర్గుల రామకృష్ణారావు గౌరవార్దం 2000 లో మార్చ్ 13 న ఒక తపాల బిళ్ళ విడుదల అయింది.
Comments