దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆదరాభిమానాలను అందుకొన్న షిర్డీ సాయి బాబా మహా సమాధి పొంది 100 సంవత్సరాలు అయినా సందర్భంగా పై మన తపాల శాఖ వారు 15 -12-2017 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు.
అవధూత/ సూఫీ సామ్రాదాయం అనుసరించిన సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు. 1858 లోమహారాష్ట్రలో ఉన్న షిర్డీ గ్రామానికి వచ్చి 1918లో సమాధి సిద్ది వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు.
A Commemorative postage stamp on SHRI SHIRDI SAI BABA |
Comments