చాలా దేశాలు జీవించి ఉన్నప్రముఖు వ్యక్తులకు వారి గౌరవార్దం తపాల బిళ్ళలు విడుదల చేస్తుంటాయి.
ఇదే కోవలో మన తపాలా శాఖ కుడా ఇంతకు ముందు కొన్ని సందర్బాలలో జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు విడుదల చేసింది. మనకు స్వతంత్రం సిద్దించిన తరువాత మహాత్మా గాంధీజీ కి బ్రతికి ఉండగానే తపాలా బిళ్ళ విడుదల చేయాలనుకొన్నా వారు వెంటనే హత్య కు గిరి కావటం వల్ల అది కార్య రూపం చెందలేదు.
నూరు ఏళ్ళు జీవించిన ప్రముఖ వ్యక్తులకు తపాలా బిళ్ళలు విడుదల చేయటం ఒక ఆనవాయితీగా వచ్చింది .
ఈ కోవలో 1958 లో తొలి సారి దేశంలో మహిళా విద్యకు బీజం వేసిన మహర్షి , భారత రత్న Dr D. K. కార్వే గారికి వారి 100 వ జన్మ దినాన (మరణం 1962లో)ఒక తపాల బిళ్ళ , అలాగే ప్రముఖ ఇంజనీర్ భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి వారి 100 వ జన్మ దినం సందర్బంగా 1960 లో (మరణం 1962లో) ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది.
1980 లో అమెరికా నివాసి, సంఘ సేవకరాలు లక్నో లిటరసీ హౌస్ స్థాపించిన వెల్ది ఫిషర్ 100 వ జన్మ దినం కు(మరణం 1980లో)ఒక తపాలా బిళ్ళ ను విడుదల చేసింది.
ఆ తరువాత నిండునూరు ఏళ్ళు జీవించిన గొప్ప వ్యక్తులు లేక ఆ సంప్రదాయం మళ్లీ రాలేదు.
అలాగే 1979 లో నోబుల్ ప్రైజ్ అందుకున్న సందర్బంగా 1980 లో మదర్ తెరిసా కి కూడా ఒక తపాలా బిళ్ళను విడుదల చేసి విమర్శల పాలైంది. ఆ తరువాత ఆమె మరనాతరం మరో మూడు తపాలా బిళ్ళలు విడుదల చేసింది.
రాష్ట్రపతి కి తపాల బిళ్ళతో వీడుకోలు
మన రాష్ట్రపతులు గా పనిచేసి పదవి విరమణ చేసే రోజున వారి గౌరవార్దం తపాలా బిళ్ళ ను విడుదల చేయటం కుడా ఒక సాంప్రదాయం గా ఉంది.
1962 లో రాష్ట్రపతిగా పదవి విరమణ చేస్తున్న బాబు రాజేంద్ర ప్రసాద్ కు, 1967 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కు 1974 లో వి.వి గిరి గారికి ఈ సాంప్రదాయాన్ని బట్టి తపాలా బిళ్ళలు వేసింది. అలాగే రాష్ట్రపతులుగా పనిసేస్తూ మరణించిన జాకీర్ హుస్సేన్ , పక్రుద్దిన్ అలీ అహమ్మద్ కు వెను వెంటనే తపాలా బిళ్ళలు వేశారు.
ఆ తరువాత కాంగ్రెసేతర రాష్ట్ర పతి గా ఉన్న నీలం సంజీవ రెడ్డి కి తపాలా బిళ్ళను వేయకుండా (ఇందిరా గాంధీ) ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది. రాష్ట్రపతి తో సహా జీవించి ఉన్న వారికి ఇకపై తపాల బిళ్ళలు విడుదల చేయకూడదను కున్న నియమాన్నిపెట్టుకుంది .
ఆ తరువాత ఇక ఎట్టి పరిస్థితులలోను జీవించి ఉన్న వ్యక్తులకు తపాల బిళ్ళలు విడుదల చేయమని చెప్పారు. అయితే 1985 లో మరోసారి అలవాటులో పొరపాటుగా కాంగ్రెస్ పార్టీ 100 వసంతాలు జరుపుకుంటున్న సందర్బంగా ఆ పార్టీకి అధ్యక్షులగా పనిచేసిన 61 మంది వ్యక్తుల బొమ్మల తో నాలుగు తపాలా బిళ్ళలు విడుదల చేసింది. అప్పటికి బ్రతికి ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి , సంజీవ రెడ్డి ,శంకర్ దయాళ్ శర్మ వంటి వారితో పాటు చివరి బొమ్మ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ చిత్రాలను ఒక తపాలా బిళ్ళ వచ్చింది . ఈ తపాలా బిళ్ళ తో మరల విమర్శలు వచాయి .
ఆ తరువాత మరల ఇప్పటివరకు మన తపాలా శాఖ జీవించి ఉన్నవారికి తపాలా బిళ్ళ వేయలేదు.
సచిన్ కొరకు సడలించిన నియమం
క్రికెట్ క్రీడ నుండి నిష్కక్రమిస్తున్న సాచి టెండూల్కర్ కొరకు తపాల శాఖ తన పాత నిర్ణయాన్ని మార్చుకుంది. తపాలా శాఖ ( కేంద్ర ప్రభుత్వం) అతి ఉత్సాహం తో ఆగమేఘాల మీద (2013 లో విడుదల చేసే తపాలా బిళ్ళలను 2012 లోనే నిర్ణయిస్తారు) సచిన్ కు ఒకటి కాదు ఏకంగా రెండు తపాలా బిళ్ళలు వాటితో పాటు ఒక మినిఎచర్ ఒక షీట్ లేట్ విడుదల చేసింది. సాదారణంగా వ్యక్తుల కు 5 రూపాయల విలువగల 3 లక్షలు తపాలా బిళ్ళలు విడుదల చేస్తారు. కాని సచిన్ కు రెండు రకాల 20 రూపాయల తపాలా బిళ్ళ లు ,ఒక్కోటి 30 లక్షల చొప్పున వెరిసి 60 లక్షలు విడుదల చేశారు. వీటి తో పాటు 24 లక్షల 40 రూపాయల విలువగల మినియెచర్లు, 16 లక్షల 320 రూపాయల విలువగల షీట్ లెట్ (16 స్టాంప్స్ ) ను విడుదల చేసారు . సచిన్ పై ఉన్న అభిమానాన్ని వ్యాపారంగా చేసుకోవటానికి మన తపాల శాఖ ఇంత వెలతో తపాల బిళ్ళలు విడుదల చేసింది .
ఈ విషయం లో మన తపాలా శాఖ (ప్రభుత్వం) మరల విమర్శకులకు పని కల్పించింది. క్రికెట్ అనేది నేడు ఒక వ్యాపార క్రీడ. కోట్లాది డబ్బు దిని చుట్టూ తిరుగుతుంది. ఈ వ్యాపారం లో తన వంతుగా తపాల బిళ్ళలు అమ్మి (కొన్ని చిన్న దేశాలు తపాల బిళ్ళలు అమ్ముకొని డబ్బు సంపాదిస్తాయి )డబ్బు గడించాలనే తపాల శాఖ వైఖరి నిజంగా గర్హనీయం.
ఇదే కోవలో మన తపాలా శాఖ కుడా ఇంతకు ముందు కొన్ని సందర్బాలలో జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు విడుదల చేసింది. మనకు స్వతంత్రం సిద్దించిన తరువాత మహాత్మా గాంధీజీ కి బ్రతికి ఉండగానే తపాలా బిళ్ళ విడుదల చేయాలనుకొన్నా వారు వెంటనే హత్య కు గిరి కావటం వల్ల అది కార్య రూపం చెందలేదు.
Dr. M. VISWESVARAYA(15-9-1960) |
ఈ కోవలో 1958 లో తొలి సారి దేశంలో మహిళా విద్యకు బీజం వేసిన మహర్షి , భారత రత్న Dr D. K. కార్వే గారికి వారి 100 వ జన్మ దినాన (మరణం 1962లో)ఒక తపాల బిళ్ళ , అలాగే ప్రముఖ ఇంజనీర్ భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి వారి 100 వ జన్మ దినం సందర్బంగా 1960 లో (మరణం 1962లో) ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది.
1980 లో అమెరికా నివాసి, సంఘ సేవకరాలు లక్నో లిటరసీ హౌస్ స్థాపించిన వెల్ది ఫిషర్ 100 వ జన్మ దినం కు(మరణం 1980లో)ఒక తపాలా బిళ్ళ ను విడుదల చేసింది.
ఆ తరువాత నిండునూరు ఏళ్ళు జీవించిన గొప్ప వ్యక్తులు లేక ఆ సంప్రదాయం మళ్లీ రాలేదు.
DR.D.K.KARVY(18-4-1958) |
WELTHY FISHER(18-3-1980) |
అలాగే 1979 లో నోబుల్ ప్రైజ్ అందుకున్న సందర్బంగా 1980 లో మదర్ తెరిసా కి కూడా ఒక తపాలా బిళ్ళను విడుదల చేసి విమర్శల పాలైంది. ఆ తరువాత ఆమె మరనాతరం మరో మూడు తపాలా బిళ్ళలు విడుదల చేసింది.
MOTHER TERESA (27-8-1980) |
రాష్ట్రపతి కి తపాల బిళ్ళతో వీడుకోలు
మన రాష్ట్రపతులు గా పనిచేసి పదవి విరమణ చేసే రోజున వారి గౌరవార్దం తపాలా బిళ్ళ ను విడుదల చేయటం కుడా ఒక సాంప్రదాయం గా ఉంది.
1962 లో రాష్ట్రపతిగా పదవి విరమణ చేస్తున్న బాబు రాజేంద్ర ప్రసాద్ కు, 1967 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కు 1974 లో వి.వి గిరి గారికి ఈ సాంప్రదాయాన్ని బట్టి తపాలా బిళ్ళలు వేసింది. అలాగే రాష్ట్రపతులుగా పనిసేస్తూ మరణించిన జాకీర్ హుస్సేన్ , పక్రుద్దిన్ అలీ అహమ్మద్ కు వెను వెంటనే తపాలా బిళ్ళలు వేశారు.
ఆ తరువాత కాంగ్రెసేతర రాష్ట్ర పతి గా ఉన్న నీలం సంజీవ రెడ్డి కి తపాలా బిళ్ళను వేయకుండా (ఇందిరా గాంధీ) ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది. రాష్ట్రపతి తో సహా జీవించి ఉన్న వారికి ఇకపై తపాల బిళ్ళలు విడుదల చేయకూడదను కున్న నియమాన్నిపెట్టుకుంది .
Centenary of Indian National Congress-portraits of Congress Presidents 28-12-1985 |
ఆ తరువాత మరల ఇప్పటివరకు మన తపాలా శాఖ జీవించి ఉన్నవారికి తపాలా బిళ్ళ వేయలేదు.
సచిన్ కొరకు సడలించిన నియమం
క్రికెట్ క్రీడ నుండి నిష్కక్రమిస్తున్న సాచి టెండూల్కర్ కొరకు తపాల శాఖ తన పాత నిర్ణయాన్ని మార్చుకుంది. తపాలా శాఖ ( కేంద్ర ప్రభుత్వం) అతి ఉత్సాహం తో ఆగమేఘాల మీద (2013 లో విడుదల చేసే తపాలా బిళ్ళలను 2012 లోనే నిర్ణయిస్తారు) సచిన్ కు ఒకటి కాదు ఏకంగా రెండు తపాలా బిళ్ళలు వాటితో పాటు ఒక మినిఎచర్ ఒక షీట్ లేట్ విడుదల చేసింది. సాదారణంగా వ్యక్తుల కు 5 రూపాయల విలువగల 3 లక్షలు తపాలా బిళ్ళలు విడుదల చేస్తారు. కాని సచిన్ కు రెండు రకాల 20 రూపాయల తపాలా బిళ్ళ లు ,ఒక్కోటి 30 లక్షల చొప్పున వెరిసి 60 లక్షలు విడుదల చేశారు. వీటి తో పాటు 24 లక్షల 40 రూపాయల విలువగల మినియెచర్లు, 16 లక్షల 320 రూపాయల విలువగల షీట్ లెట్ (16 స్టాంప్స్ ) ను విడుదల చేసారు . సచిన్ పై ఉన్న అభిమానాన్ని వ్యాపారంగా చేసుకోవటానికి మన తపాల శాఖ ఇంత వెలతో తపాల బిళ్ళలు విడుదల చేసింది .
SACHIN TENDULKAR (14-11-2013) |
Comments