Skip to main content

పెరు దేశపు తపాల బిళ్ళ పై తాజ్ మహల్

పెరు - భారత్ దేశల మధ్య ద్వైపాక్షిక సంభందాలకు 50 ఏళ్ళు నిండిన సందర్బంగా 25 - 03- 2013 న పెరు దేశం జంట  తపాలా బిళ్ళలు (se-tenant)విడుదల చేసింది. వాటిపై ప్రపంచ వింతల లో చోటు చేసుకున్నరెండు దేశాలలో ఉన్న కట్టడాలు చోటు చెసుకున్నాయి. 
పెరు దేశం లో ఉన్న మచ్చు- పిచ్చు  పర్వతాల పై ఉన్న రాజ ప్రసాదాలు ఒక తపాలా బిళ్ళ పైనా , మన దేశం లో ప్రఖ్యాత కట్టడం అయిన తాజ్ మహల్ ను మరొక తపాలా బిళ్ళ పైన ముద్రించారు.
భారత్ - పెరు దేశల మధ్య ద్వైపాక్షిక సంభందాలకు 50 ఏళ్ళు నిండిన సందర్బంగా మన దేశం కుడా ఈ అంశం పై త్వరలో రెండు తపాలా బిళ్ళలు విడుదల చేస్తుంది. 

Comments