Jerdon'S Courser
Date of issue : 07-10-1988
Date of issue : 07-10-1988
జేర్దోన్స్ కోర్సెర్ అనే కలివి కోడి మన రాష్ట్రంలో తూర్పు కనుమలలో మాత్రమే జీవించుతూ త్వరలో అంతరించి పోతున్న జాతి చెందిన పక్షి. కడప,అనంతపూరు,బద్రాచలం అడవి ప్రాంతం లోమాత్రమే అరుదుగా కనిపించే ఈ పక్షి ని 1986 లో శాత్రవేత్తలు చూడటం తటస్త పడినది.
ఒక అంచనా ప్రకారం ఈ పక్షులు ఇప్పుడు కేవలం పదుల సంఖ్యల లోనే ఉన్నాయి.
తెలుగు గంగ కాలవ పనులతో ఈ పక్షులకు హాని కలిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అటవీ శాఖ వారు ప్రాజెక్ట్ పనులకు అభ్యంతరాలు తెలిపారు. అయినా స్వల్ప మార్పులతో తెలుగు గంగ పనులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ అరుదైన పక్షులను కాపాడాలన్న ఉద్దేశంతో తపాల శాఖా ఒక తపాల బిళ్ళను 07-10-1988 న విడుదల చేసింది. ఈ కలివి కోడిని మన రాష్ట్రం లో తొలిసారి గుర్తించి న మన దేశ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ ని ఫస్ట్ డే కవర్ పై చూడవచ్చు.
1-10-2005 లో కడప జిల్లా తపాల బిళ్ళల ప్రదర్శనలో (CUDDAPEX - 2005) తపాల శాఖ ఒక ప్రత్యక కవరును విడుదల చేసింది. ఈ కవర్ పై అరుదైన పక్షి 'కలివి కోడి'(Jerdon'S Courser) బొమ్మతోతయారుచేసిన ప్రత్యేక పోస్టల్ ముద్రను క్యాన్సిలెషన్ కొరకు వాడటం జరిగింది.
ఒక అంచనా ప్రకారం ఈ పక్షులు ఇప్పుడు కేవలం పదుల సంఖ్యల లోనే ఉన్నాయి.
తెలుగు గంగ కాలవ పనులతో ఈ పక్షులకు హాని కలిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అటవీ శాఖ వారు ప్రాజెక్ట్ పనులకు అభ్యంతరాలు తెలిపారు. అయినా స్వల్ప మార్పులతో తెలుగు గంగ పనులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ అరుదైన పక్షులను కాపాడాలన్న ఉద్దేశంతో తపాల శాఖా ఒక తపాల బిళ్ళను 07-10-1988 న విడుదల చేసింది. ఈ కలివి కోడిని మన రాష్ట్రం లో తొలిసారి గుర్తించి న మన దేశ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త డాక్టర్ సలీం అలీ ని ఫస్ట్ డే కవర్ పై చూడవచ్చు.
Jerdon's Courser - FDC |
Comments