Skip to main content

Posts

Showing posts from 2013

గుర్తింపు లేని నీలం సంజీవరెడ్డి శత జయంతి

భారతదేశపు ఆరోవ రాష్ట్రపతిగా 1977-1983 వరకు పనిచేసిన శ్రీ నీలం సంజీవ రెడ్డి(1913-1996) గారి శత జయంతి ని గుర్తించని కేంద్ర ప్రభుత్వం దేశ రాజధానిలో మన తెలుగు వారిని  మరో సారి కించపరిచింది. రాష్ట్రపతి గా ఏకగ్రీవంగా ఎన్నికై   రెండు సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేసి  రెండు పర్యాయాలు లోకసభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి  శ్రీ నీలం సంజీవరెడ్డి. వారి శత జయంతి ని మన రాజధాని ఢిల్లీ లో తలుచుకున్న నాధుడే లేడు.  మన రాష్ట్రపతులు గా పనిచేసి పదవి విరమణ చేసే రోజున వారి గౌరవార్దం తపాలా బిళ్ళ ను విడుదల చేయటం కుడా ఒక సాంప్రదాయం గా ఉంది.  1962 లో రాష్ట్రపతిగా పదవి విరమణ చేస్తున్న బాబు రాజేంద్ర ప్రసాద్ కు, 1967 లో సర్వేపల్లి రాధాకృష్ణన్ కు 1974 లో వి.వి గిరి గారికి ఈ సాంప్రదాయాన్ని బట్టి తపాలా బిళ్ళలు వేసింది. అలాగే రాష్ట్రపతులుగా పనిసేస్తూ మరణించిన జాకీర్ హుస్సేన్ , పక్రుద్దిన్ అలీ అహమ్మద్ కు వెను వెంటనే తపాలా బిళ్ళలు వేశారు. ఆ తరువాత కాంగ్రెసేతర రాష్ట్ర పతి గా ఉన్న నీలం సంజీవ రెడ్డి కి తపాలా బిళ్ళను వేయకుండా (ఇందిరా గాంధీ) ఈ సంప్రదాయానికి స్వస్తి చెప్పింది.  ఇది కాంగ్రెస్ మార్క్ రాజకీయం.  రాష్ట్రప

ఇండియా -జపాన్ మైత్రి బంధం ... కుతుబ్ మినార్ - టోక్యో టవర్

India Post released a 20 rupees Miniature stamp   on the Visit of Emperor Akihitho  and Empress Michiko  of Japan on 5th December 2013. The miniature sheet shows Qutub Minar and Tokyo Tower  Qutub Minar and Tokyo Tower జపాన్ దేశ రాజు రాణి మన దేశానికి వచ్చిన సందర్బం గా మన తపాలా శాఖ  5-12-2013 న ఒక మినిఎచర్ షీట్ ని విడుదల చేసింది.  ఇలా ప్రముఖులు దేశ సందర్శన కు వచ్చినపుప్పుడు వారి గౌరవార్దం వారి చిత్రాలతో  తపాలా బిళ్ళలు విడుదల చేయటం చాలా దేశాలలో ఉంది. కాని మన దేశం లో వ్యక్తుల ప్రీతి కొరకు ఇప్పటి వరకు తపాలా బిళ్ళలు విడుదల చేయలేదు. ఇదే తొలిసారి. జపాన్ రాజు రాణి చిత్రాలు కాకుండా ఇండియా -జపాన్ మైత్రి బంధం గా  దీనిపై కుతుబ్ మినార్ ,టోక్యో టవర్ చిత్రాలు ముద్రించారు.   

కంచరపార మరియు జమలపూర్ రైల్వే వర్క్ షాప్స్

India Post released a New Set of  Two Stamps and one Miniature sheet for  Railway Workshops - Kanchrapara and Jamalpur " on 26th November 2013. తూర్పు రైల్వే పరిధి లో ఉన్న కంచరపార మరియు జమలపూర్ లో ఉన్న రైల్వే వర్క్ షాప్స్ కు 150 ఏళ్ళు నిండిన సందర్బంగా 26 - 11 -2013 న మన తపాల శాఖ రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ ను విడుదల చేసింది.                                          Railway Workshops - Kanchrapara ,Jamalpur 

జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు- సచిన్ కొరకు సడలించిన నియమం

చాలా దేశాలు జీవించి ఉన్నప్రముఖు వ్యక్తులకు వారి గౌరవార్దం తపాల బిళ్ళలు విడుదల చేస్తుంటాయి. ఇదే కోవలో మన తపాలా శాఖ కుడా ఇంతకు ముందు కొన్ని సందర్బాలలో జీవించి ఉన్న వారికి తపాలా బిళ్ళలు విడుదల చేసింది.  మనకు స్వతంత్రం సిద్దించిన తరువాత  మహాత్మా గాంధీజీ కి బ్రతికి ఉండగానే తపాలా బిళ్ళ విడుదల చేయాలనుకొన్నా వారు వెంటనే హత్య కు గిరి కావటం వల్ల అది కార్య రూపం చెందలేదు.  Dr. M. VISWESVARAYA(15-9-1960) నూరు ఏళ్ళు జీవించిన ప్రముఖ వ్యక్తులకు తపాలా బిళ్ళలు విడుదల చేయటం ఒక ఆనవాయితీగా వచ్చింది . ఈ కోవలో    1958 లో తొలి సారి దేశంలో మహిళా విద్యకు బీజం వేసిన  మహర్షి , భారత రత్న Dr D. K. కార్వే గారికి వారి 100 వ జన్మ దినాన (మరణం 1962లో)ఒక తపాల బిళ్ళ , అలాగే  ప్రముఖ ఇంజనీర్ భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి వారి 100 వ జన్మ దినం సందర్బంగా 1960 లో  (మరణం 1962లో)   ఒక తపాల బిళ్ళను విడుదల చేసింది.  1980 లో అమెరికా నివాసి, సంఘ సేవకరాలు లక్నో లిటరసీ హౌస్ స్థాపించిన   వెల్ది ఫిషర్ 100 వ జన్మ దినం కు (మరణం 1980లో) ఒక తపాలా బిళ్ళ ను విడుదల చేసింది. ఆ తరువాత  నిండునూరు ఏళ్ళు జీవించిన గొప్ప వ్యక్

Children's Day - 2013

India Post released a stamp   on 14th November 2013  to celebrate Children's Day Children's Day - 2013 ప్రతి సంవత్సరం నవంబర్ 14 న నెహ్రు గారి జయంతి ని మన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బాలల దినోత్సవానికి మన తపాలా శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు. దానిపై మన బాల,బాలికలకు దేశ వ్యాప్తంగా ఒక అంశం పై చిత్ర లేఖన పోటి లు నిర్వహించి వాటిలో ప్రధమ స్థానం పొందిన చిత్రాన్ని ఈ తపాల బిళ్ళ పై ముద్రిస్తారు.  అలాగే ఈ ఏడాది   తపాల శాఖ వారు నిర్వహించిన చిత్ర లేఖన పోటిలో ప్రధమ బహుమతి పొందిన చిత్రాన్ని  బాలల దినోత్సవం   14-11-2013న ప్రత్యక తపాలా బిళ్ళ గా  విడుదల చేసారు.  

సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం - తపాలా శాఖ ( కేంద్ర ప్రభుత్వం) అతి ఉత్సాహం

India Post released two postal Stamps and one miniature sheet, one Sheet let  On 14th November 2013, to honor Sachin Tendulkar, on veiw of his 200th test match at Mumbai.  Sachin Tendulkar - miniature sheet మన తపాలా శాఖ వారు అభిమాన క్రికెట్ క్రీడాకారుడు   సచిన్ టెండూల్కర్ కి అరుదైన గౌరవం తో సత్కరించారు . మన దేశం లో జీవించి ఉన్న ఎ క్రీడా కారునికి దక్కని గౌరవం ఒక్క సచిన్ కె దక్కింది.  200 వ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ  క్రికెట్ నుండి రిటైర్ అవుతున్న సందర్బం గా 14-11-2013 న సచిన్ టెండూల్కర్ పై రెండు తపాలా బిళ్ళలు (Rs 20/-), ఒక మినిఎచర్, ఒక షీట్ లెట్ ను విడుదల చేసారు. మన తపాలా శాఖ సాదారణంగా జీవించి ఉన్న వ్యక్తులకు తపాల బిళ్ళ విడుదల చేయదు. ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టి సచిన్ కు తపాలా బిళ్ళలు విడుదల చేసి తమకు క్రికెట్ పిచ్చి ఉందని ప్రపంచానికి చాటుకుంది.  Sachin Tendulkar -  sheet let

భారతీయ విద్య భవన్

India Post released a stamp on 7th November 2013 to commemorate 75 years of Bharatiya Vidya Bhavan, which was set up by Dr. K.M Munshi in 1938 Bharatiya Vidya Bhavan and Dr. K.M.Munshi భారతీయ విద్య భవన్ స్థాపించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మన భారత తపాలా శాఖ 7- 11- 2013 న ఒక ప్రత్యక తపాలా బిళ్ళను విడుదల చేసింది.దీనిని 1938 లో గాంధీజీ సహకారం తో స్వాతంత్ర సమర యోదుడు శ్రీ కే యం  మున్షీ  గారు స్థాపించారు . " Let noble thoughts come to us from every side"   అనే ఋగ్వేద సూక్తం తో ఇది మన దేశం లో విద్య సేవ చేస్తుంది.  Dr. K.M.Munshi - Stamp Issued in 1988 నేడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో భారతీయ విద్యాభవన్ పేరుతో 100 పైగా విద్యాలయాలు నడపబడుచున్నాయి. మన రాష్ట్రం లో కుడా 14 చోట్ల భారతీయ విద్య భవన్ వారి విద్యాలయాలు ఉన్నాయి . వాటి వివరాలు - Bharatiya Vidya Bhavan's International Residential Public School - Vidyashram - Bhimavaram Bhavan's Vidyashram - Guntur Bhavan's Atmakuri Rama Rao School - Hyderabad Bhavan's Vidyalaya - Hyder

భాక్ర డ్యాం - దేశ సేవలో 50 వసంతాలు

India Post released a stamp depicting the Bhakra Dam on 22nd October 2013 to celebrate 50 years of its glorious service of the Nation Golden Jubilee of Bhakra Dam భాక్ర డ్యాం సట్లేజ్ నది పై హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ లో నిర్మించ బడినది.  ఆధునిక దేవాలయం గా నెహ్రు గారిచే కీర్తించబడిన భాక్ర డ్యాం  225.25 మీ ఎత్తు తో మన దేశం లోఎత్తేయిన ఆనకట్టలలో  రెండోవ స్థానం లో ఉంది. దీనికి దిగువన మరో ఆనకట్ట నంగల్ లో ఉంది. ఈ రెంటిని కలపి భాక్రా నంగల్ ఆనకట్ట గా ప్రసిద్ది చెందినవి . 1955 లో మొదలు పెట్టి 1963 లో నిర్మాణం పూర్తి చేసుకొన్న ఈ బహుళార్దక ఆనకట్ట 50 ఏళ్లుగా మన దేశానికి ఉపయోగ పడుతున్నది.  ఈ  స్వర్ణోత్సవ వేళ మన తపాలా శాఖ 22-10-2013 న ఒక ప్రత్యక తపాలా బిళ్ళ ను విడుదల చేసింది.  ఇంతకు ముందు కుడా ఈ డ్యాం పై రెండు తపాల బిళ్ళలు విడుదల చేసారు.  A Definitive stamp on Bhakra dam - 15-3-1967 Silver Jubilee of Bhakra dam - 15-12-1988

అమరజీవి పొట్టి శ్రీరాములు

India post issued a Commemorative postage stamp  on freedom fighter, social worker  Amarajivi  POTTI SRIRAMULU on  16 - 3 - 2000 POTTI SRIRAMULU ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి యైన మహాపురుషుడు, పొట్టి శ్రీరాములు (1901-1952) ఆంధ్రులకు ప్రాత:స్మరణీయుడు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడు. మహాత్మ గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడు. స్వతంత్ర సమర యోధుడు .  ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19 న మహర్షి బులుసు సాంబ మూర్తి గారి ఇంట్లో నిరాహారదీక్ష ప్రారంభించాడు .56 రోజులు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15  న  పొట్టి శ్రీరాములు, ఆంద్ర రాష్ట్ర ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్దం తపాల శాఖ వారు 16 మార్చ్ 2000 లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు . FDC -POTTI SRIRAMULU

Two Special Covers released at Hyderabad

50 Glorious Years in Wild Life -  Nehru Zoological Park , Hyderabad   A Special Cover  released  by India Post on  06.10.2013. Diamond Jubilee of  Begumpet  Air Force Station (1953-2013)-  Hyderabad   A Special Cover  released  by  Army  postal service on  08.10.2013.

దైవ కణం గురించి ప్రతిపాదించిన సత్యేంద్రనాథ్ బోస్

India Post released a stamp on Satyendranath Bose on 1-1-1994.   Satyendranath Bose (1894-1974) మన దేశం గర్వించదగిన శాస్త్రవేత్త లలో సత్యేంద్ర నాద బోసు ఒకరు. వారి శతజయంతి సందర్బంగా మన తపాలా శాఖ 1-1-1994 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదల చేసింది . వారు బౌతిక శాస్త్రం లో చేసిన కృషి నేడు పరోక్షంగా నోబెల్ బహుమతికి నోచుకుంది.  2013 సంవత్సరానికి ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్   దైవ కణం గురించి ప్రతిపాదించిన పీటర్  హిగ్స్,ఇంగ్లర్ట్ లకు లభించింది.1964 లో వీరితోపాటు రాబర్ట్ బ్రోట్  కూడా ఉన్నారు తరువాత  పీటర్ర్ హిగ్స్ విశేష పరిశోధన చేసారు వీరితొ  పాటు కార్ల్ హెగెన్,గెరాల్డ్, టామ్ కిబ్ల్ కూడా దీని ఉనికిని ప్రతిపాదించారు.            ఈ  నోబెల్ బహుమతి లో  గమనించాల్సిన ముఖ్య విషయమమేమంటే మన దేశానికి చెందిన ప్రసిద్ద శాస్త్రవేత్త, పద్మ విభూషణ్  సత్యేంద్రనాథ్ బోస్ చేసిన కృషి. ఈ దైవ  కణం ఉనికిని 1926  ప్రాంతంలోనే వారు ప్రతిపాదించారు. ఈయన పేరుతోనే దీనికి బోసాన్ అనిపేరు వచ్చింది.  ఈ కణం నుండే సృష్టిలోని గ్రహాలూ,నక్షత్రాల వరకు సమస్త పదార్దానికి ద్రవ్యరాశి చేకూరుతుంది.   స్విట్జర్లాండ్ లోని సెర్న్ ప

అహింసా మూర్తికి ఘన నివాళి - One more Souvenir Sheet On Gandhiji

India Post released New Souvenir Sheet on the occasion of   "Philately day 2013" on 12th October 2013. The Souvenir Sheet Shows two stamps of Mahatma Gandhi Issued by India Post in 1948 (12A) and 1969 (75) Souvenir Sheet  – Philately Day – Mahatma Gandhi మన తపాలా బిళ్ళల లో  సింహ భాగం మహాత్మా గాంధీ పైనే విడుదల చేసారు. తపాలా బిళ్ళల సేకరణలో మహాత్మా గాంధీజీ తపాలా బిళ్ళ లకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది . ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఈ అహింసా మూర్తిని తమ తపాలా బిళ్ళ ల పై ముద్రించి గౌరవించాయి. వీటిని సేకరించటానికి పలు దేశాలలో తపాల బిళ్ళ ల సేకరణ దారులు తహతహ లాడుతుంటారు. పాత తపాల బిళ్ళలు అందరికి అందుబాటులో ఉండటానికి ఇలా ప్రత్యేక స్మారక తపాలా చిత్రం ( Stamps on Stamp) విడుదల చేస్తారు.    తపాలా బిళ్ళల సేకరణ దినోత్సవం సందర్బం గా 12-10-2013 న మన తపాలా శాఖ ఒక సావనీర్ షీట్ (  స్మారక తపాలా చిత్రం ) విడుదల చేసింది. దిని పై మాహాత్మ గాంధీ చిత్రం తో పాటు 1948 లో విడుదలైన 12 అణాల గాంధీ తపాలా బిళ్ళ ,1969 లో విడుదలైన 75 పైసల గాంధీ తపాలా బిళ్ళలు ఉండేలా 20 రూపాయల తపాలా బిళ్ళ ను రూపొందించార

ఎట్టకేలకు గురజాడకు తపాల బిళ్ళ

India Post Released one  Commemorative  postal stamp  on Great Telugu Poet Gurajada Venkata Apparao  on his 151th Birth anniversary on   21 May 2013. మహా కవి శ్రీ గురజాడ వెంకట అప్పారావు గారికి తపాల బిళ్ళ విడుదల చేయాలన్న అభిమానుల కోరిక నెరవేరింది.  అనేక విన్నపాల తరువాత ఎట్టకేలకు మన భారత తపాలా శాఖ గురజాడ వెంకట అప్పారావు గారి 151 వ జయంతి సందర్బంగా   21-09-2013 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది.  Gurajada Venkata Apparao మన ప్రభుత్వ అధ్వర్యంలో నిరుడు గురజాడ 150వ జయంతి ఉత్సవాలు చాలా ఖర్చు పెట్టి  హడావుడిగా చేసారు. అప్పుడు నిర్వహాకులకు ముందు చూపు, సరైన ప్రణాళిక లేక గురజాడ వారి 150 వ జయంతికి  తపాల బిళ్ళను  విడుదల చేయించలేక పోయారు. కేవలం ఒక ప్రత్యేక తపాలా కవరు మాత్రమే విడుదల చేసారు. ఆలస్యంగా నైనా "దేశమంటే మట్టి కాదోయ్ , దేశమంటే మనుషులోయ్ " అని చాటిన  మన గురజాడకు ఘనంగా తపాలా బిళ్ళ విడుదల  చేసి ఆ మహనీయునికి  దేశవ్యాప్త గుర్తింపు కలుగచేస్తున్నందులకు సంతోషం.

Engineers' Day - మోక్షగుండం విశ్వేశ్వరయ్య

A Commemorative postage stamp on 15-09-1960 BHARATHA RATNA Dr.MOKSHAGUNDAM VISVESWRAYA భారత రత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1860-1962) బెంగుళూరు దగ్గర్లో ఉన్న ముద్దినేహళ్ళి అనే గ్రామంలో ఒక పేద కుటుంబంలో పుట్టారు. దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం వారి పూర్వికులు ఆంధ్ర నుండి మైసూరు ప్రాంతం వలసపోవటం జరిగింది. మైసూరు మహారాజు వారి ఆర్థికసహాయంతో పూనాలో ఇంజనీరింగు చదివి, 1884 లో బొంబాయిలో ప్రభుత్వ ఇంజనీరుగా ఉద్యోగం సంపాదించారు. ఆ ఉద్యోగంలో ఆయన బొంబాయి పట్టణ అభివృద్దికి అపారమైన సేవల ం దించారు. హైదరాబాద్ కు వరదలు వచ్చినపుడు సర్ M . V . నిజాం నవాబు ఆహ్వానంపై హైదరాబాదు వచ్చి రెండు రిజర్వాయరులు నిర్మించి, పట్టణ డ్రైనేజి పధకం తయారు చేసి, ఏడు నెలలలో కార్యక్రమం పూర్తిచేసి నవాబుగారి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం విశ్వేశ్వరాయ మైసూరు మహారాజు వారి అభ్యర్థనపై ఆస్థానంలో చీఫ్ ఇంజనీరుగా చేరి, అనేక నిర్మాణాత్మక పనులు చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసి 1912లో దివాన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విశ్వేశ్వరాయలోని క్రమశిక్షణ, పనియందు గౌరవాభిమానాలు, నిజాయితీ గురించ

Wild flowers of India

India Post released as set of 12 stamps and three miniature  sheets  in the occasion of Asian Pacific Postal Union Congress , held at New Delhi  on 3rd September 2013  All the 12 stamps are issued on theme of 'Wild flowers of India' Miniature sheets of  Wild flowers of India

మై స్టాంప్ - వ్యకిగత తపాలాబిళ్ళ

తపాల బిళ్ళ పై సాదారణంగా జాతీయ నాయకులు, ప్రసిద్ది పొందిన కవులు,కళాకారులు, క్రీడాకారులు బొమ్మలు మాత్రమే ఉంటాయి . అయితే కొద్దిగా మార్పు తో సామాన్యులు సైతం తమ బొమ్మను (బ్రతికి ఉన్నప్పుడే) తపాలా బిళ్ళ పై చూచుకునే అవకాశం వచ్చింది. తపాలా బిళ్ళల సేకరణ పై అభిరుచి పెంచటానికి మన తపాలా శాఖ 'My Stamp'  పేరుతో తొలిసారి 2011 లో డిల్లీ లో జరిగిన అంతర జాతీయ తపాలా బిళ్ళల ప్రదర్శన లో వ్యకిగత తపాలా బిళ్ళలు విడుదల చేసింది. దానికి కొనసాగింపుగా  భారత తపాలా శాఖ 23-8-2013 నుండి విజయవాడ లో కొత్తగా ' మై స్టాంప్ ' (నా తపాలాబిళ్ళ)  పేరుతో వ్యక్తుల అభీష్టం మేరకు వారు కోరుకున్న చిత్రం తో తపాలా బిళ్ళలు విడుదల చేయాటానికి శ్రీకారం చుట్టింది. తమ బొమ్మతో 5 రూపాయల విలువగల 12 తపాలా బిళ్ళల గల ఈ మై స్టాంప్ షీట్ ను   300 రూపాయలకు విజయవాడ ప్రధాన తపాలా కార్యాలయం లో పొందవచ్చు. 17 రకాల తపాలా బిళ్ళల కాంబినేషన్ తో ఈ 'మై స్టాంప్' షీట్స్ లబిస్తాయి. ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు పత్రం మరియు పోటో తీసుకొని వెళ్లి ఈ తపాలా బిళ్ళను పొందవచ్చు.  మై స్టాంప్ నమూనా చిత్రం 

జై హింద్ -15 ఆగష్టు 1947

మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటి సారిగా తపాల బిళ్ళను 1947 నవంబర్ 21 న  విడుదల చేసారు. దానిపై మన  జాతీయ జండా తో పాటు ' జై  హింద్ ' అనే నినాదం హిందీలోను  -15 AUG 1947 అని ముద్రించ బడినాయి. ఆ తరువాత డిసెంబర్ 15 న మరో రెండు తపాల బిళ్ళలు ముద్రించారు. వాటిపై మన జాతీయ చిహ్నం (సారానాథ్ లోని  అశోక స్థంబం పై ఉన్న నాలుగు సింహాల బొమ్మ) మన స్వేచ్చకు గుర్తుగా నింగిలో విహరించే విమానం ముద్రించ బడినాయి.     INDIAN NATIONAL FLAG DATE OF ISSUE :21 -11 -1947  National Emblem of India - The Lion Capital of Asoka  DATE OF ISSUE :15 -12 -1947  Indian   Airplane. DATE OF ISSUE :15 -12 -1947    

కడప లో తపాల బిళ్ళలు మరియు నాణెలు ప్రదర్శన

NUPHILEX -KADAPA , 26,27,28 JULY 2013    GNPS -  (Guntur Numismatic and Philatelic Society)   గుంటూరు వారి నిర్వహణతో 2013 జూలై 26,27,28 తేదిలలో కడప పట్టణం  లో తపాల బిళ్ళలు మరియు నాణెలు ప్రదర్శన జరుగుతుంది. కడప లోని TTD  కళ్యాణ మంటపం, మద్రాస్ రోడ్ లో  మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలోఅరుదైన  వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణెలు, కరెన్సీ నోట్లు ప్రదర్శించ బడతాయి. ప్రవేశం ఉచితం. ఈ సందర్బంగా పాటశాల విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు కుడా నిర్వహిస్తున్నారు.  తపాలా బిళ్ళలు, నాణేల సేకరణ కర్తల కొరకు  స్టాంప్స్ మరియు కాయిన్ డీలర్స్ 20 పైగా స్టాల్ లు ఏర్పాటు చేసినట్లు GNPS  కార్యదర్శి శ్రీ ప్రసాద్ తెలియ జేస్తున్నారు. 

శ్రీలంక తపాలా బిళ్ళ పై స్వామి వివేకానంద

స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్బంగా శ్రీలంక  తపాలా శాఖ వారికి ఘన నివాళి గా 7-6-2013 న ఒక  ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. Swami Vivekanda - Sri Lanka Swami Vivekanada-Sri Lanka- Fdc వివేకానందునికి నివాళిగా ఇంతకు ముందు కుడా శ్రీలంక ప్రభుత్వం15-01-1997 లో  ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.  Swami Vivekanada- Visit to Sri Lanka Swami Vivekanada- Visit to Sri Lanka- FDC మన తపాల శాఖ వారు ఇంతకు ముందు స్వామి వివేకానంద పై వివిద సందర్బాలలో విడుదల చేసిన  తపాలా బిళ్ళల ను చూడటానికి ---   స్వామి వివేకనంద -1 , swami vivekanda-2