Skip to main content

ప్రపంచ తెలుగు మహా సభలు

ఒక జాతి సంస్కృతిని, సాహిత్యాన్ని, వైభవాన్ని,ఔన్యత్వాన్ని,చరిత్రను  పది కాలాల పాటు ప్రపంచం నలువైపులా చాటి చెప్పేవి తపాలా బిళ్ళలే. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానంగా, అపురూపంగా దాచుకొనే తపాళా బిళ్ళల ప్రాముఖ్యం చెప్పనలవి కానిది. తపాల బిళ్ళ ఒక గౌరవ చిహ్నం.
అంగరంగ వైభవం గా 1975 లో ప్రపంచ తెలుగు మహా సభలు తొలి సారి హైదరాబాదు లో జరిగినప్పుడు మన పోస్టల్ శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఆనాటి సభలకు తీపి గుర్తుగా అనేక మంది తపాలా బిళ్ళల సేకరణ దారుల వద్ద పదిలంగా బద్రపరచ బడినవి.

ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు 

హైదరాబాద్ లో 12 -04 -1975 న(ఉగాది పర్వదినాన) ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు జరిగినప్పుడు మన భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళ ను విడుదల చేసారు. ఈ తపాల బిళ్ళ వెల 25 పైసలు. దాని పై చదువుల తల్లి సర్వస్వతి చిత్రం దాని వెనుక తెలుగు పదాలు ముద్రించారు. 


A Commemorative postage stamp on world telugu conference 
Date of  Issue -   12 -04 -1975

'దేశ భాషల యందు తెలుగు లెస్స 'అన్న శ్రీ కృష్ణ దేవరాయల పలుకులు, 
'ఎందరో మహానుభావులు అందరికి వందనములు' అన్న శ్రీ త్యాగరాజ స్వామి కృతి పదాలుతో పాటు 'పనస తొనల కన్న,కమ్మని తేనకన్న తెలుగు మిన్న' అనే మాటలు  ఈ తపాల బిళ్ళ పైన ముద్రించారు.
ఈ అక్షరాల పైన ఉన్న చదువుల తల్లి సరస్వతి శిల్పం నకలు ఒకటి  ఢిల్లీ లో ఉన్న జాతీయ పురాతన వస్తు ప్రదర్శన శాలలోను మరొకటి లండన్ మ్యుజియం లోను ఉంది.  వీటిని బికనూర్ ( రాజస్తాన్) లో ఒక జైన మందిరం నుండి సేకరించారు. సాధారణం గా సరస్వతి దేవి విగ్రహం హంస వాహనం పై వీణపాణి గా కన్పిస్తుంది. అయితే జైన మత గ్రంధాలలో వర్ణించ బడిన విద్యాదేవి పుస్తక పాణి గా ఉంటుంది.


తొలి రోజు విడుదల చేసిన  ప్రత్యేక కవరు పైన తెలుగు జాతి ఘన చరిత్రకు చిహ్నంగా  అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం ను ముద్రించారు. హైదరాబాద్ లో విడుదల చేసిన కవర్ పై తపాల ముద్రగా
తెలుగు సభల లోగో ముద్రించారు 
First day  cover - Hyderabad 
First day  cover-World Telugu Language Conference,calcutta 

Comments

Jeevan Jyoti said…
Nice to see this new Blog.
kodali srinivas said…
Thank you very much Jeevan Jyoti,for your visit of my Telugu blog"Stamps of Andhra".Your blog #
Rainbow Stamp Club is listed in my blog list.
మీ బ్లాగు చూడడం ఇదే తొలిసారి. ఎంత బాగుందో చెప్ప లేను. మీకు నా అభినందనలు.
kodali srinivas said…
మీ అభిప్రాయం చెప్పినందులకు ధన్యవాదాలు

Popular posts from this blog

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

కవి రాజు త్రిపురనేని రామస్వామి- 125వ జయంతి

ఈ ఏడాది  కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి  125 వ జయంతి సంవత్సరం.  1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులో పుట్టిన త్రిపురనేని   తెలుగు నాట హేతువాద భావాలు వెదజల్లిన వైతాళికుడు.  కవి రాజు గారి  125 వ జయంతి సంవత్సరంలో  వారు చూపిన హేతువాద మార్గం లో సమాజం ముందుకు పోయేలా అభుదయ వాదులు, హేతువాదులు కృషి చేయాలి. వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ తిరిగి ప్రతిస్టించేలా కృషి చేయాలి. 1987 లో వారి  శత జయంతి సందర్బంగా మన తపాలా శాఖ  ఒక ప్రతేక తపాల బిళ్ల (ఇండియా స్వతంత్ర పోరాటం - ఫిఫ్త్ సిరీస్ లో భాగంగా) 60 పైసల స్టాంప్ విడుదల చేసింది. T . RAMA SWAMY CHOWDARY Date of Issue :25 -04-1987 తెలుగు నాట హేతువాదభావాలను వెదజల్లిన హేతువాది, వైతాళికుడు,కవిరాజుగా ప్రసిద్ధి చెందిన  త్రిపురనేని రామస్వామి  (1887-1943) గొప్ప సంఘసంస్కర్త, స్వతంత్ర యోధుడు. తెనాలి లో వారు స్థాపించిన ' సూతాశ్రమం' అనేక సంస్కరణ ఉద్యమాలకు  కేంద్రంగా  భాసిల్లింది.  ప్రజలను   మేలుకొలిపే   హేతువాద   భావాలను   వ్యక్తపరచడానికి   సాహి...