ఒక జాతి సంస్కృతిని, సాహిత్యాన్ని, వైభవాన్ని,ఔన్యత్వాన్ని,చరిత్రను పది కాలాల పాటు ప్రపంచం నలువైపులా చాటి చెప్పేవి తపాలా బిళ్ళలే. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానంగా, అపురూపంగా దాచుకొనే తపాళా బిళ్ళల ప్రాముఖ్యం చెప్పనలవి కానిది. తపాల బిళ్ళ ఒక గౌరవ చిహ్నం.
అంగరంగ వైభవం గా 1975 లో ప్రపంచ తెలుగు మహా సభలు తొలి సారి హైదరాబాదు లో జరిగినప్పుడు మన పోస్టల్ శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఆనాటి సభలకు తీపి గుర్తుగా అనేక మంది తపాలా బిళ్ళల సేకరణ దారుల వద్ద పదిలంగా బద్రపరచ బడినవి.
ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు
హైదరాబాద్ లో 12 -04 -1975 న(ఉగాది పర్వదినాన) ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు జరిగినప్పుడు మన భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళ ను విడుదల చేసారు. ఈ తపాల బిళ్ళ వెల 25 పైసలు. దాని పై చదువుల తల్లి సర్వస్వతి చిత్రం దాని వెనుక తెలుగు పదాలు ముద్రించారు.
'దేశ భాషల యందు తెలుగు లెస్స 'అన్న శ్రీ కృష్ణ దేవరాయల పలుకులు,
'ఎందరో మహానుభావులు అందరికి వందనములు' అన్న శ్రీ త్యాగరాజ స్వామి కృతి పదాలుతో పాటు 'పనస తొనల కన్న,కమ్మని తేనకన్న తెలుగు మిన్న' అనే మాటలు ఈ తపాల బిళ్ళ పైన ముద్రించారు.
ఈ అక్షరాల పైన ఉన్న చదువుల తల్లి సరస్వతి శిల్పం నకలు ఒకటి ఢిల్లీ లో ఉన్న జాతీయ పురాతన వస్తు ప్రదర్శన శాలలోను మరొకటి లండన్ మ్యుజియం లోను ఉంది. వీటిని బికనూర్ ( రాజస్తాన్) లో ఒక జైన మందిరం నుండి సేకరించారు. సాధారణం గా సరస్వతి దేవి విగ్రహం హంస వాహనం పై వీణపాణి గా కన్పిస్తుంది. అయితే జైన మత గ్రంధాలలో వర్ణించ బడిన విద్యాదేవి పుస్తక పాణి గా ఉంటుంది.
తొలి రోజు విడుదల చేసిన ప్రత్యేక కవరు పైన తెలుగు జాతి ఘన చరిత్రకు చిహ్నంగా అమరావతి లో లభ్యమైన పూర్ణ కుంభం ను ముద్రించారు. హైదరాబాద్ లో విడుదల చేసిన కవర్ పై తపాల ముద్రగా

A Commemorative postage stamp on world telugu conference
Date of Issue - 12 -04 -1975

తెలుగు సభల లోగో ముద్రించారు
First day cover - Hyderabad |
First day cover-World Telugu Language Conference,calcutta |
Comments
Rainbow Stamp Club is listed in my blog list.