మహర్షి బులుసు సాంబమూర్తి : స్వతంత్ర యోదుడు,గాన్దేయ వాది. గాంధీజీ పిలుపునందుకొని న్యాయవాద వృత్తిని వదలి స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారు. వీరు 1919లో హోంరూల్ ఉద్యమంలోను, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోను, 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలోను, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోను మరియు నీల్ సత్యాగ్రహంలోను పాల్గొని కారాగార శిక్షలు అనుభవించారు. తరువాత వీరు తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు కమిటీకి అధ్యక్షులుగాను, 1929లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యులుగాను, 1935-37 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగాను వ్యవహరించారు.విశాలాంద్ర కొరకు పోరాడిన మహనీయుడు.మద్రాసులో వీరి గృహంలోనే అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంద్ర రాష్ట్రం కొరకు అసువులు బాశారు.
1937లో మద్రాసు రాష్ట్ర శాసనసభకు వీరు సభాపతిగా విధులను సంప్రదాయాలకు అనుగుణంగా, మర్యాదగా, అద్వితీయంగా నిర్వహించి సభకు గౌరవ ప్రతిష్ఠలను సమకూర్చారు.
తన సర్వస్వాన్ని దేశోద్ధరణకు సమర్చించిన వీరు మహర్షిగా 1958 పరమపదించారు.
Comments