Special Cover : THIRUMALA - PICTORIAL POSTMARK
Date of Issue : 06-11-1976
తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయం చరిత్ర లో మనకు వెంటనే స్పురించే వారిలో మొదటి వాడు అన్నమయ్య అయితే రెండోవవాడు శ్రీ కృష్ణ దేవరాయలు.శ్రీ కృష్ణ దేవరారాలు శ్రీవారికి సమర్పించిన ఆభరణాల మాట ఎటు తెలకపోయిన వారి విగ్రహాలు మాత్రం గుడిలో బద్రంగా ఉన్నాయి. రాయల వారి పంచ శతాబ్ది పట్టాభిషేకం సందర్బంగా తెలుగు వారు వారిని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవటం ముదావహం.
తిరుమల తపాల కార్యాలయానికి కేటాయించిన ప్రత్యేక పోస్టల్ ముద్ర లో పద కవితా పితామహుడు అన్నమయ్య చిత్రం,ఆసందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక కవరు పై శ్రీవారి ఆనందనిలయం లో ముఖిళిత హస్తాలతో దేవేరులతో ఉన్న శ్రీ కృష్ణ దేవారాయల కాంస్య విగ్రహాలు చిత్రించారు. రాయల వారి పంచ శతాబ్ది పట్టాభిషేకం సందర్బంగా వారిపై త్వరలో ఒక తపాలా బిళ్ళ కుడా విడుదల చేయబోతున్నారు.
Comments