On the occasion of Krishna Pushkaralu 2016, A.P. postal circle released a set of post cards and Special Covers
అంగరంగ వైభవంగా నవ్యఆంధ్రలో జరిగిన కృష్ణ పుష్కరాలు -2016 ( 12 నుండి 23 ఆగస్టు -16) సందర్భంగా
ఆంద్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ప్రత్యక తపాలా కవర్లు విడుదల చేసింది.
అమరావతి - ధ్యాన బుద్ధ (10-08-2016) |
ఇంద్రకీలాద్రి - విజయవాడ (10-08-2016) |
శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం -19-08-2016 |
శ్రీ కాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయం - శ్రీకాకుళం, కృష్ణ జిల్లా (16-08-2016) |
బాపు మ్యూజియం -విజయవాడ (21-08-2016) |
గాంధీ హిల్ , విజయవాడ బుక్ ఫెస్టివల్ - 22-08-2016 |
ఇవేకాక కృష్ణ పుష్కరాలు జరిగే కృష్ణ నదీతీరాలలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ , ఆంద్ర ప్రదేశ్ లలో ఉన్న 18 ముఖ్యమైన దేవాలయాల చిత్రాలు ఉన్న 18 ప్రత్యేక పోస్టల్ కార్డ్స్ ను కూడా ముద్రించారు. వీటిపై ఆయా ప్రాంతాల ప్రత్యేక తపాలా ముద్రలు ఉన్నాయి. వీటిలో ఆంద్ర ప్రదేశ్ కు చెందిన సంఘమేశ్వరం, శ్రీశైలం , వేదాద్రి, అమరావతి, విజయవాడ, మోపిదేవి, హంసల దీవి ఉన్నాయి
కృష్ణ పుష్కరాలు - 2004
ప్రతి పండెండు ఏళ్లకు వచ్చే కృష్ణ నదీ పుష్కరాలు 2004 లో 28-8-2004 నుండి 08-09-2004 వరకు జరిగినప్పుడు విజయవాడ,గుంటూరు,తెనాలి పట్టణాభివృద్ది సంస్థ ఆర్దిక సౌజన్యంతో తపాల శాఖ విడుదల చేసిన మేఘదూత్ పోస్ట్ కార్డు. దీనిపై విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న కృషవేణి మాత, ఇన్ద్రకిలాద్రీ పై కొలువై ఉన్న కనక దుర్గ ఆలయం, ఉండవల్లి గుహలు ముద్రించారు.
MEGHDOOT POST CARD ON KRISHNA RIVER.
PUSHKARAMS- 2004
కృష్ణ పుష్కరాలు - 2004
Comments