MEGHADOOT POST CARDS ON GROUND WATER PROTECTION
నీరే ప్రాణకోటికి జీవాధారం. అలాంటి జలాన్ని సంరక్షిస్తేనే మనం సుభిక్షితంగా జీవిస్తాం. ఈ సందేశాన్ని అందరికి తెలియజేయటానికి మన తపాల శాఖ మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ పై సందేశాలను ముద్రించింది.
2004 లో నార చంద్రబాబు అద్వర్యంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణ కొరకు నడుంకట్టి దానికి విస్తృత ప్రచారాన్ని కల్పించింది. ఇంకుడు గుంటల ఆవశ్యకతను తెలియజేసి అదొక మహా యజ్ఞం లా చేపట్టింది. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన 25 పైసల ఈ 'మేఘదూత్ పోస్ట్ కార్డ్స్' ఇచ్చే సందేశాలు గమనించండి. అయిన మనలో స్పందన లేదు. దాని పలితాన్ని ఇప్పుడు చూస్తున్నాం. అప్పటిలా ఈ యజ్ఞాన్ని అపహాస్యం చేయకుండా మనస్పూర్తిగా చేపడదాం. రాష్ట్ర వ్యాప్తంగా భూగర్బ జలాల సంరక్షణకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలపండి. స్వర్ణ ఆంధ్రకు జై కొట్టండి.
జలో రక్షతి రక్షితః
నీరు లేక ప్రగతి లేదు - నీరు లేక జగతి లేదు
భూగర్బ జలం అముల్యమైనది -దానిని ఆదాచేయండి, కాపాడండి.
Ground Water is Precious ... Save it and Protect it
Ground Water is Precious ... Conserve, Augment, Protect
భూగర్బ జలం అమూల్యము - కాపాడటం మన కర్తవ్యం
Artificial recharge through Contour Bunding in Hilly Tettain
పారే నీటికి అడ్డు కట్ట వేయండి - నీటిని నిల్వ చేయండి
Artificial recharge through Check Dams
ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే - వడిసి పట్టు
Every Drop Counts ... Commit, Collaborate, Conserve
ఇంటింట ఇంకుడు గుంట - భవిషత్ కు జే గంట
Roof Top Rain water Harvesting
వర్షపు నీటిని నిల్వచేయండి - నీటి ఎద్దడిని వెళ్ళగొట్టండి
Comments