Skip to main content

Posts

Showing posts from 2017

India and Papua - Joint Issue

India  and Papua post jointly released new set of two stamps and a miniature for on  30-12-2017  on diplomatic relations between India and Papua New Guinea 

విసన కఱ్ఱల పై తపాలా బిళ్ళలు

A set of 16 stamps on Indian Hand Fans was released by India Post on 30th December  2017 మన దేశంలో ప్రాచీన కాలంలో వివిధ ప్రాంతాలలో వాడిన అందమైన విసన కఱ్ఱల పై  మన తపాలా శాఖ 30-12-2017 న 16 రకాల తపాలా బిళ్ళలు  (16x15 =240 ) విడుదల చేసింది. 

దిగుడు బావుల పై తపాలా బిళ్ళలు

A set of 16 stamps on Step wells was released by India Post on 30th December  2017 మన దేశంలో ప్రాచీన కాలంలో వివిధ ప్రాంతాలలో నిర్మించిన అత్యంత సుందరమైన దిగుడు బావుల పై మన తపాలా శాఖ 30-12-2017 న 16 రకాల తపాలా బిళ్ళలు  (8x 5 , 8x15 ) విడుదల చేసింది.  Stepwells - 1.Chand Baori, Abhaneri; 2. Raniji Ki Baori, Bundi; 3. Toor Ki Jhalra, Jodhpur; 4. Panna Mian Ki Baori, Jaipur; 5. Nagar Sagar Kund, Bundi; 6. Neemrana Stepwell, Alwar; 7. Pushkarini Stepwell, Hampi;8.  Muskin Bhanvi Stepwell, Lakkundi; 9. Adalaj Stepwell, Adalaj; 10. Surya

తపాల బిళ్ళపై షిర్డీ సాయి బాబా

దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆదరాభిమానాలను అందుకొన్న షిర్డీ సాయి బాబా మహా సమాధి పొంది 100 సంవత్సరాలు అయినా సందర్భంగా పై మన తపాల శాఖ వారు 15 -12-2017 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. అవధూత/ సూఫీ సామ్రాదాయం అనుసరించిన సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవి. అద్వైతం, భక్తి మార్గం, ఇస్లాం సంప్రదాయాలు అతని బోధనలలోనూ, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. ఎంతో మంది, సాయిబాబాను దైవ స్వరూపునిగా నమ్మి ఆరాధిస్తున్నారు. 1858 లోమహారాష్ట్రలో ఉన్న షిర్డీ గ్రామానికి వచ్చి 1918లో సమాధి సిద్ది వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నాడు. A Commemorative postage stamp on SHRI SHIRDI SAI BABA ఇంతకు ముందు కూడా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆదరాభిమానాలను అందుకొన్న షిర్డీ సాయి బాబా పై మన తపాల శాఖ వారు 20-05-2008 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. A Commemorative postage stamp on 20-05-2008 Date of issue :20 -05-2008  SAI BABA - MAXIMUM CARD

తపాలా బిళ్లల పై మహాభారతం- విశ్వరూప దర్శనం

పంచమ వేదం గా ప్రసిద్ధి చెందిన భారతీయ ఇతిహాస కావ్యం "మహాభారతం " పై మన తపాలా శాఖ 18 తపాలా బిళ్లలను రెండు మినియేచర్ షీట్స్ ను 27-11-2017 న విడుదల చేసింది. వీటిలో  12 తపాలా బిళ్ళలు 15 రూపాయలు , 4 తపాలా బిళ్ళలు 25 రూపాయలు, ఒకటి 50 రూపాయలు, మరొకటి 100 రూపాయలు విలువ కలవి.  వీటిలో 50,100 రూపాయల బిళ్లలతో మినియేచర్స్ గా కూడా ముద్రించారు.  ఈ తపాలా బిల్లలపై మహా భారత గ్రంధ నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో వివిధ కాలాల్లో రూపుదిద్దుకున్న చిత్రాలకు స్థానమిచ్చారు. వాటిలో మన ఆంధ్ర ప్రాంతంలో కలంకారీ చిత్రకళ ఒకటి. దీన్ని ప్రతిపాదికగా చేసుకొని 50 రూపాయల తపాలా బిళ్ళ మరియు మినియేచర్ ను రూపొందించారు. అలాగే ఆంద్ర- కర్ణాటక ప్రాంతాలలో మహాభారతాన్నిజానపద కళా పక్రియ అయినా తోలు బొమ్మలాట గా ప్రదర్శిస్తారు. తోలు బొమ్మలాటలో "ద్రౌపది" బొమ్మతో మరొక 15 రూపాయల తపాలా బిళ్ళ ను కూడా విడుదల చేశారు.  కలంకారీ వస్త్రంపై  మహాభారతం- కురుక్షేత్రం తోలుబొమ్మలాటలో - ద్రౌపది  మహాభారతం- విశ్వరూప దర్శనం  మహాభారతం- 18 పర్వాలు ముఖ్య ఘట్టాలు 

జాతీయ బాలల దినోత్సవం -2017

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా 14-11-2017 న మన తపాలా శాఖా రెండు తపాలా బిళ్ళలు మినియేచర్ తో కలిపి విడుదల చేసింది . దేశవ్యాప్తంగా బాలలకు చిత్రలేఖన పోటీలు "నెస్ట్ " (గూడు) పై నిర్వహించి వాటిలో ఉత్తమమైన వాటిని ఈ తపాలా బిళ్లలపై ముద్రించారు. 

భారతీయ వంటకాలపై తపాలా బిళ్ళలు

ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా మన తపాలా శాఖ ద్వారా కమ్మని నోరూరించే మన భారతీయ వంటకాలపై 24 తపాలా బిళ్ళలు 3-11-2017 న విడుదలైనాయి. ఈ వంటకాలను పండుగ వేళ వండుకునే పబ్బాలు - పిండివంటలు , దేవుడి కి గుళ్లో ప్రసాదాలుగా చేసేవి, దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రసిద్ధమైన వంటకాలుగా, దేశ విదేశాలలో అంతటా ప్రాముఖ్యతను సంతరించుకున్నదేశీయ  వంటకాలాగా నాలుగు తరగతులుగా విభజించి నాలుగు మినియేచర్లు కూడా  విడుదల చేసారు.  వీటిలో తిరుపతి లడ్డు, హైదరాబాద్ బిరియానీ. గుత్తి వంకాయ కూర, కజ్జి కాయ, దోశ- ఇడ్లి వంటి మన తెలుగు వంటకాలు కూడా ఉన్నాయి.  భారతీయ వంటకాలు  పండుగ పబ్బాలు - పిండి వంటలు   దేవుని ప్రసాదాలు    ప్రాంతీయ వంటలు   అందరు మెచ్చే వంటకాలు 

ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం పై తపాలా బిళ్ళలు

మన భారత తపాలా శాఖ 1-11-2017 న ఆదికవిగా కీర్తించబడిన నన్నయ్య మరియు   ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం   పైన తపాలా బిళ్ళలు విడుదల చేశారు. ఇదే సందర్భంగా కన్నడ కవి ముద్దన పై కూడా ఒక తపాలా బిళ్ళ విడుదల చేశారు . ఈ మూడు తపాలా బిళ్ళలు ఒకే తపాలా కవరు పై కర్ణాటక రాష్ట్ర ఆతరణ దినోత్సవం నవంబర్ ఒకటో తేదీన (మన పూర్వ ఆంద్ర ప్రదేశ్ అవతరణ  దినోత్సవం  కూడా అదే) బెంగళూరులో విడుదల చేశారు. కవి ముద్దన, ఆదికవి నన్నయ్య మరియు ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం   ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం చారిత్రిక ప్రసిద్ధి చెందిఉంది. ఇక్కడ ఉన్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా

India and Russia - Joint Issue

India  and Russia post jointly released new set of two stamps and a miniature for 70 years of diplomatic relations between India and Russia.  These Stamps shows bhavai dance(2500) of Rajasthan and Beryozka dance(500) of Russia.

Chhatrapati Shivaji International Airport - Mumbai

Two Commemorative Stamps and a Miniature Sheet were released on 75 years on Chhatrapati Shivaji International Airport by by India Post on 15th October 2017.  The event was organised in the memory of the Late JRD Tata, who on October 15, 1932, piloted the first flight of Tata Air Services from Karachi to Mumbai via Ahmedabad carrying airmail.

దీపావళి పై తపాలా బిళ్ళలు

చీకటిని పారదోలేది జ్యోతి. జ్ఞానాన్ని ప్రసాదించేది దీపం.  దీపాల వరుస దీపావళి .  చీకటిని పారద్రోలి వెలుగులు నింపే దీపావళి జ్ఞాన కాంతులు వెదజల్లాలని ఆశిస్తూ దీపావళి శుభాకాంక్షలు.  ఆనందాల వెలుగులు ప్రసరించే దీపావళి పండుగకు గుర్తుగా అనేక తపాలా బిళ్ళలు విడుదల చేశారు.  మన దేశం కెనడా దేశం రెండు కలసి సంయుక్తంగా దీపావళి పై 21-09-2017 న రెండు తపాలా బిళ్ళలు విడుదల చేసాయి.  ఇంతకు ముందు దీపావళి పండుగ ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ  అమెరికా తపాలా శాఖ 5-10-2016 న ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.    అలాగే జ్యోతి హిందువులతో పాటు జురాస్టియన్ మతం వారికి పవిత్రమైనది.  ఇజ్రాయిల్ మరియు భారత దేశాలు తమ మద్య మొదలైన ద్వైపాక్షిక సంభందాలకు 20 వసంతాలు పూర్తి అయిన సంధర్బం గా ఇరు దేశాలు Festivals of Lights  పేరుతో రెండు తపాలా బిళ్ళలను 5-11-2012 న విడుదల చేసారు. మన  రెండు దేశాలలో  దీపాలు వెలిగించి జరుపుకొనే దీపాల పండుగల ను ఇతి వృత్తం గా తీసుకుని రూపొందించిన ఈ తపాల బిళ్ళల పై  మన దీపావళి , ఇజ్రాయిల్ లో జరుపుకొనే హనుక్కః పండుగలు ను సూచించే ప్రమిదలు, క్రోవ్వత్తులు ముద్రించారు.  Stamps by India post

నీలగిరి పక్షులు

మన భారత తపాలా శాఖ 18-09-2017 న  నీలగిరి కనుమలలో కనిపించే పక్షులపై మూడు తపాలా బిళ్ళలను, ఒక మినియేచర్ ను విడుదల చేసింది. అంతరించబోయే పక్షులలో జాబితాలో ఉన్న వీటిని సంరక్షించాల్సిన భాద్యత ఎంతో ఉంది. 

India - Belarus Joint Issue

మన తపాలా శాఖ 12-09-2017 న  భారత్ - బెలారస్ దౌత్య సంబంధాలు ఏర్పడి 25 ఏళ్ళు నిండిన సందర్భంగా ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. అలాగే బెలారస్ కూడా ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 

తపాలా బిళ్ళలపై రామాయణం

దసరా పండుగ సందర్భంగా మన తపాలా శాఖ హిందూ మత  ప్రామాణిక గ్రంధాలలో ప్రముఖమైన రామాయణ  గ్రంధం లోని ముఖ్య ఘట్టాలతో 11 తపాలా బిళ్ళల ను  22-09- 2017 న విశ్వవ్యాప్తంగా విడుదల చేసింది.  దీనిపై సీతా రామ స్వయంవరం, శ్రీ రాముడు తండ్రి ఆజ్ఞను శిరసావహించటం , భరతునికి పాదుకలు ఇవ్వటం, గృహుడు చే నదిని దాటటం, జటాయువు చే సీతాపహరణ గురించి తెలుకోవటం , శబరి చే ఫలహారం స్వీకరించటం, హనుమంతుడు అశోకవనంలో సీత జాడ కనుగొనటం, లంకకు వారధి కట్టే సమయంలో ఉడుత సహాయం, లక్ష్మణుడి కొరకు హనుమ సంజీవని తెచ్చుట, రామ బాణంతో రావణ సంహారం (ఇవి అన్ని 5 రూపాయల విలువతో ఉన్నవి) మధ్యలో 15 రూ  విలువతో శ్రీ సీతారామ పట్టాభిక్షేకం  తో వీటిని రూపొందించారు.  తపాలా బిళ్ళలపై  రామాయణం  ఇంతకు ముందు 14-10- 1970 లో రామాయణ గ్రంధకర్త మహర్షి వాల్మీకి పై  ఒక తపాలా బిళ్ళను  విడుదల చేశారు. దీనిపై సీతా రామ లక్ష్మణ ల వనవాసం, బంగారు లేడి చిత్రాలు చూడవచ్చు.  Maharsi Valmiki Miniature sheet - Ramayana Sheet let - Ramayana

చలపతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIET) - గుంటూరు

A special cover was released to celebrate 10 year of Chalapathi Institute of Engineering and Technology (CIET) on 19th March 2017. ఇంజనీరింగ్ విద్య కొరకు లాం ఆవరణలో 2007 లో చలపతి ఇన్స్టిట్యూట్  అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIET) స్థాపించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాలా కవర్ 19-3-2017 న విడుదల చేసింది.  Chalapathi Institute of Engineering and Technology (CIET) 1996 లో  స్థాపించబడిన చలపతి విద్యాలయాలు గుంటూరు ప్రాంత వాసులకు విద్యనందిస్తున్నాయి.  చలపతి ఎడ్యుకేషనల్ సంస్థ క్రింద నర్సరీ నుండి పది వరకు విద్య బోదన కొరకు చలపతి ప్రైమరీ మరియు  హై స్కూల్ , ఇంటర్ కొరకు చలపతి జూనియర్ కాలేజీ, డిగ్రీ కొరకు చలపతి డిగ్రీ కాలేజీ లు పనిచేస్తున్నాయి. వీటితో పాటు బి.ఫార్మా,ఫార్మాడీ, యం.ఫార్మా  విద్య  కొరకు చలపతి ఫార్మా కాలేజీ(CIPS) 2005 లో స్తాపించబడినది. ఇంజనీరింగ్ విద్య కొరకు  2007 లో చలపతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIET ) పేరుతో  లాం ఆవరణలో  ఒక ఇంజనీరింగ్ కాలేజీ, 2008 లో చలపతి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (CIT ) పేరుతో,మోతడక ఆవరణలో మరొక  ఇం

Beautiful India

A miniature sheet on Beautiful India was issued  by India Post on 15th August 2017. మన తపాలా శాఖ 15-08-2017 న 'అందమైన భారతదేశం' పేరుతో రెండు తపాలా బిళ్ళలు ఒక మినియేచర్  ను విడుదల చేసింది. 

Caves of Meghalaya

A miniature sheet on Caves of Meghalaya was released by India Post on 15th August 2017. మన తపాలా శాఖ 15-8-17 న మేఘాలయ పర్వత గుహలపై నాలుగు తపాలా బిళ్ళలు, మరియు ఒక మినియేచర్ ను విధుల చేసారు.  

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

A special cover was released India Post (A.P.) at Uyyalawada on 22nd February 2017 to celebrate the 170th death anniversary of the first freedom fighter of Uyyalawada, Uyyalawada Narasimha Reddy. స్వతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 170 వ వర్థంతి  సందర్భంగా 22-02-2017 న మన తపాలా శాఖ ఒక ప్రత్యేక కవర్ విడుదల చేసింది. 

క్విట్ ఇండియా పోరాటం

To commemorate 75 years of 1942 Quit India Movement a set of 8 Commemorative Stamps and a Miniature Sheet was released by India Post on 9th August, 2017 మన దేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన , కీలకమైన ఉద్యమం క్విట్ ఇండియా పోరాటం. ఇది జరిగి 75 సంవత్సరాలు అయినా సందర్భంగా మన తపాలా శాఖ 8 తపాల బిళ్ళలు మరియు ఒక మినియేచర్ ను 9-8-2017 న విడుదల చేసింది.  క్విట్ ఇండియా ఉద్యమంపై ఇంతకు మునుపు కూడా మూడుసార్లు ( 1967, 1983, 1992 లలో ) తపాలా బిళ్ళలు విడుదల చేసారు 1 October 1967 ,Quit India Movement - 25th Anniversary, Martyrs' Memorial, Patna Quit India Resolution - 40th Anniversary (9-8-1983) Do or Die - Mahathma Gandhi - 50th Anniversary (9-8-1992) Quit India - 50th Anniversary (9-8-1992)