సాదారణంగా మన తపాలా బిళ్ళ ల పై హిందీ మరియు ఇంగ్లీష్ భాష లలో వాటిని గురించిన వివరాలు ముద్రించబడి ఉంటాయి. అరుదుగా కొన్ని సందర్బాలలో మన ప్రాంతీయ బాషలు కుడా వాటిపై చోటుసేసు కుంటాయి. అలా మన తెలుగు అక్షరాలు మన భారత దేశ తపాల బిళ్ళల పై మూడు సార్లు చోటు చేసుకున్నాయి. తపాళ బిళ్ళ పై తెలుగు అక్షారాల వివరాలు.
మొదటి సారి 16- 10 -1972 లో భారత తపాలా శాఖ విడుదల చేసిన ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశం గారి స్మారక తపాలా బిళ్ళ పై ప్రకాశం పంతులు గారు తెలుగులో పెట్టే సంతకం 'టం.ప్రకాశం'ముద్రించ బడినది.
ప్రకాశం గారి సంతకం తో ఉన్న తపాలా బిళ్ళ |
రెండో సారి 12-4- 1975 న ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభల సందర్బం గా విడుదలైన తపాల బిళ్ళ పై
'దేశ భాషల యందు తెలుగు లెస్స 'అన్న శ్రీ కృష్ణ దేవరాయల పలుకులు,
'ఎందరో మహానుభావులు అందరికి వందనములు' అన్న శ్రీ త్యాగరాజ స్వామి కృతి పదాలుతో పాటు
'పనస తొనల కన్న,కమ్మని తేనకన్న తెలుగు మిన్న' అనే తెలుగు మాటలు ముద్రించ బడ్డాయి.
తెలుగు మహా సభల లో విడుదల చేసిన స్టాంప్ |
మూడోసారి 07-05-2010 న భారత తపాల శాఖ వారు ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు. ఈతపాల బిల్లపై ద్రావిడ భాషల పై విసృత పరిశోధనలు చేసిన రాబర్ట్ క్లాద్వేల్ చిత్రం తో పాటు తెలుగు,కన్నడం,తమిళం,మలయాళం అని ఆయా భాషలలో ముద్రించబడినాయి.
భాషా శాస్త్రవేత్త రాబర్ట్ క్లాద్వేల్ |
Comments