A Special Cover On KALIYUGA BHIMA KODI RAMAMURTHI
by India Post on 28 -1- 1995
కోడి రామ్మూర్తి నాయుడు |
మన భారత తపాలా శాఖ వారు VIZNUPEX-'95 విజయనగరం లో జరిగిన సందర్బంగా కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు గారికి నివాళిగా28-01-1995 న ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసారు. ఈ ప్రత్యేక కవర్ పై ఉపయోగించటానికి విజయనగరం రాజకోట తో ప్రత్యేక తపాలా ముద్రను రూపొందించారు.
కోడి రామ్మూర్తి నాయుడు (1885 - 1942)
ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు, సర్కస్ వీరుడు.
మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్రలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది.
ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. వీరు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.
ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. వీరు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.
మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయమ శిక్షణోపాధ్యాయునిగా పని చేశారు. తరువాత ఒక సర్కస్ సంస్థను స్థాపించి తన బలప్రదర్శనతో దేశ విదేశాలలో ప్రేక్షకులను అబ్బురపరిచారు.
బల ప్రదర్శన విశేషాలు -
- గట్టిగా ఊపిరి పీల్చుకుని కండలు బిగించి, తన ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను తెంచేవారు.
- ఛాతీ మీదకు ఏనుగును ఎక్కించుకుని ఐదు నిముషాల పాటు నిలిపేవారు.
- రెండు కార్లను వాటికి కట్టిన తాళ్ళు రెండు చేతులుతో పట్టుకుని కదలకుండా ఆపేవారు.
- ఒంటి చేత్తో రైల్ ఇంజను ఆపిన ఘనుడు.
- 21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1.5 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు.
కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ,'ఇండియన్ హెర్క్యులెస్' అనే బిరుదులనుపొందారు.
Comments