Skip to main content

ఆచార్య నాగార్జునుడు

India post Issued a Special Cover in Decennial celebrations of Guntur Numismatic & Philatelic Society (GNPS)on 4- 12 -2004. The cancellation on cover Shows the Statue of Acharya Nagarjunudu.
GNPS - దశాబ్ది ఉత్సవాల సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక తపాలా కవర్
Acharya Nagarjuna (150-250 CE) is widely considered the most important Buddhist philosopher. He is credited with founding the Madhyamaka school of Mahayana Buddhism He is traditionally supposed to have written several treatises on rasayana alchemy as well as serving a term as the head of Nalanda University.
Acharya Nagarjuna Statue is often depicted in composite form comprising human and naga characteristics. Often the naga aspect forms a canopy crowning and shielding his human head. The notion of the naga is found throughout Indian religious culture, and In Buddhism, it is a synonym for a wise person.

ప్రత్యేక తపాలా ముద్ర -ఆచార్య నాగార్జునుడు 
GNPS  దశాబ్ది ఉత్సవాల సందర్బంగా  భారత తపాలా శాఖ 4-12-2004 న గుంటూరు లో ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసింది. ఈ ప్రత్యేక కవర్ పై ఉన్న తపాలా ముద్రను  ఆచార్య నాగార్జునుడు నాగ పడగ నీడలో ఆసీనుడై ఉన్న చిత్రం తో రూపొందించబడినది. ఇది గుంటూరు జిల్లా లో ఉన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో ప్రతిష్టించిన నాగార్జుని విగ్రహం యొక్క రూపం. బౌద్ద మతం లో నాగు పాము పడగ మేధావికి చిహ్నం గా పరిగణిస్తారు.
ఆచార్య నాగార్జునుడు (150-250 CE) 
బౌద్ద ఆచార్యుడు, మహాయాన బౌద్ధం ప్రచారకుడు, శూన్య వాద తత్వవేత్త, రసాయన శాస్త్రవేత్త, ఆయుర్వేద వైద్యుడు. అమరావతి మరియు శ్రీపర్వతం (నందికొండ/నాగార్జునసాగర్) ప్రాంతాలలో క్రీస్తు తరువాత 150-250 ఏళ్ల మద్య నివసించాడని చరిత్రకారుల అభిప్రాయం.

Comments

Popular posts from this blog

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

Stamps Issued by India Post- 2024

భారత తపాలా శాఖ  2024 లో మొత్తం 32 ప్రత్యేక తపాల బిళ్లలను, 11 మినియేచర్స్  విడుదల చేసింది.  వీటిలో అత్యధిక విలువతో 100 రూపాయల శ్రీ రామ జన్మభూమి దేవాలయం పై  మినియేచర్  ముఖ్యమైనది. 6 తపాలా బిళ్లలతో కేవలం 30 రూపాయల ముఖ విలువగల దీనిని 100 రూపాయలకు అమ్మటం జరిగింది.  ఇంతకు ముందు ఖాదీ వస్త్రంపై మహాత్మ గాంధీ పై 100 రూపాయల విలువగల  ముద్రించిన తపాల బిళ్ళ ఉన్న మినియేచర్ ను 300 రూపాయలకు చేసి అమ్మారు. ఇదే ఇప్పటివరకు  ఖరీదైనదిగా నమోదు చేయబడింది. ఈ ఏడాది మన వెండి తెర వెలుగు పద్మభూషణ్ అక్కినేని శతజయంతి సందర్భంగా 10 రూపాయల విలువగల ఒక తపాలా బిళ్ళ వెలువడింది.  Sri Rama Janmbhoomi Temple Face Rs 30  Sold for  Rs 100 Embedded with Water from the holy river Saryu, Soil from the holy city of Ayodhya, Fragrance of Sandal wood, and gold foil at relevant portions శ్రీ రామ జన్మభూమి దేవాలయం - మినియేచర్  1.      Shri Ram Janmbhoomi Temple 18 JAN 500 p(6) 10,00,000 Security Printing Press, Hyderabad 2. 100th Birth Anniversary of Karpoori Thaku...

శ్రీ కల్లూరిచంద్రమౌళి

గుంటూరులో చంద్రమౌళి నగర్ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి శ్రీ కల్లూరిచంద్రమౌళి.చంద్రమౌళి గారి సహాయ సహకారాలతో రూపుదిద్దుకున్న ఈ కాలని నేడు గుంటూరులో ఒక  ప్రముఖ నివాస  ప్రదేశంగా అభివృద్ధి చెందింది.త్వరలో శ్రీ చంద్ర మౌళి గారి కాంస్య విగ్రహాన్ని చంద్రమౌళి నగర్ ఫస్ట్ లైన్,రింగ్ రోడ్ కూడలిలో ప్రతిష్టించనున్నారు.వారి గౌరవార్దం ఒక ప్రత్యక తపాల కవరు విడుదల చేయటానికి కుడా ప్రయత్నాలు చేస్తున్నారు.రాజకీయ విలువలు దిగజారి పోతున్న నేటి రోజులల్లో ఆ మహనీయుని గురించి తెలుసుకోవాలిసిన ఆవశ్యకత ఎంతో ఉంది.   శ్రీ కల్లూరి చంద్రమౌళి(Kalluri chandramouli, 1898-1992)  గారు నిష్కలంక దేశ భక్తుడు ,గాన్దేయ వాది,  స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు. ఈయన సంయుక్త మద్రాసు రాష్ట్రములోను, ఆంధ్ర రాష్ట్రములోనూ, ఆంధ్ర ప్రదేశ్ లోనూ మంత్రిపదవి నిర్వహించాడు. తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. తాను నమ్మిన విలువలకు విఘాతం కల్గిందన్న భాదతో యమ్.యల్. ఎ. పదవికి రాజీనామా చేసిన ఉన్నత మైన రాజకీయ నాయకుడు. కల్లూరి చంద్రమౌళి గారు 1...