Skip to main content

Posts

Showing posts from March, 2010

వెంకట రమణ భాగవతార్

A Commemorative postage stamp on 27 - 12 - 2009 VENKATARAMANA BHAGVATHAR త్యాగ రాజు గారి ప్రియ శిష్యుడు కర్నాటక సంగీత లో నిష్ట్నాతుడు , వాగ్గేయ కారుడు శ్రీ వేంకట రమణ భాగవతార్ . త్యాగ రాజ స్వామి తన మరణం కు ఒక నెల రోజుల ముం దు వేకట రమణ భాగావతర్ను పిలిచి తన ఆరాధ్య దైవం శ్రీ రామ చంద్ర మూర్తి పూజా విగ్రహాన్ని , దానితో పాటు తన తాళ పత్ర కృ తులు ఇచ్చి తన సంగీత వారసత్వాన్ని కొనసాగించమని కోరా డు . త్యాగ రాజ స్వామి శిష్య పరంపర కొనసాగటానికి వేంకటరమణ భాగవతర్ చేసి న కృషి మరువ లేనిది . తెలుగు , సంస్కృతాలలో మంచి ప్రావీణ్యం ఉన్న శ్రీ వేంకటరమణ భాగవతార్ గారు అనేక కృతులను రచించారు .వీరి గౌరవార్దం 27 - 12 - 2009 లో ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల అయింది.

బూర్గుల రామకృష్ణారావు

A Commemorative postage stamp on 13 - 3 - 2000 Dr .BURGULA RAMAKRISKNA RAO బూర్గుల రామకృష్ణారావు ( 1899 - 1967 ) మహబూబ్ నగర్ జిల్లా, తలకొండ పల్లి మండలం లోని పడకల్ గ్రామంలో జన్మించాడు. ఇంటిపేరు పుల్లం రాజు . అయితే తన స్వగ్రామమైన బూర్గుల పేరుమీదుగా రామకృష్ణారావు బూర్గుల అని ప్రసిద్ధుడై, బూర్గుల ఆయన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు వ్యవస్థాపకుల్లో బూర్గుల ప్రముఖుడు. పార్టి తరపున ఆయన అనేక కార్యక్రమాలకు నేతృత్వం వహించాడు. శాసనోల్లంఘన ఉద్యమంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం అనుభవించాడు. 1948 లో పోలీసు చర్య అయి, సైనిక ప్రభుత్వం ఏర్పడినపుడు, ఆయన రెవిన్యూ, విద్యాశాఖల మంత్రి అయ్యాడు. 1952 లో మొదటిసారి హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికలు జరిగాక ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసారు . ఆ తరువాత 1956 లో హై దరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, కోస్తా, రాయలసీమ లతో కలిపి , ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడింది . విశాల ఆంద్ర కొరకు ముఖ్య మంత్రి పదవిని త్యాగం చే...

మేఘ దూత్ పోస్ట్ కార్డ్స్ -1

Meghadoot post cards మేఘదూత్ పోస్ట్ కార్డ్స్ అనేవి తపాల శాఖలో ఒక నూతన వరవడికి శ్రీకారాన్ని చుట్టాయి . సాదారణంగా 50 పైసల పోస్ట్ కార్డు అయితే , మేఘదూత్ కార్డు కేవలం 25 పైసలే . వీటిలో అడ్రెస్స్ వ్రాసే ప్రక్క ఉన్న ఖాళి భాగం లో ప్రకటనలు చోటు చేసుకొంటాయి . ప్రకటన కర్తలు పోస్టల్ శాఖ వారికి రెండు రూపాయలు చెల్లిస్తారు . వీటిలో వ్యాపార ప్రకటనలు , ప్రభుత్వ ప్రకటనలు ఉంటాయి . ఈ మేఘదూత్ కార్డ్స్ అందంగా ఉండుటమే కాక మంచి సందేశత్మకంగా కుడా ఉంటాయి. వీటిని సేకరిచటం మంచి ఆనందాన్ని కలిగిస్తాయి . మన తెలుగు లో వెలువడిన మేఘదూత్ కార్డ్స్ గురించి న విశేషాలు తెలియజేస్తాను . 32 వ జాతీయ క్రీడలు హైదరాబాద్ లో జరిగిన సందర్బంగా 2002, నవంబర్ 19 న విడుదలైన మేఘదూత్ కార్డు. ఇదేమన తెలుగులో వచ్చిన మొదటి మేఘదూత్ కార్డు. దేశంలో మూడోవ కార్డు.క్రీడా చిహ్నం ' వీర' కాగడ తో ఉన్న ఈ మేఘదూత్ కార్డు పలువురిని ఆకర్షించాయి. ఆ తరువాత హైదరాబాద్ లో జరిగిన మొదటి ఆఫ్రో ఆసియన్ క్రీడలకు స్వగతం పలుకుతూ 2003 అక్టోబర్ 23 న మరొక మేఘదూత్...

ఎల్.వి.ప్రసాద్

A Commemorative postage stamp on 5- 9 - 2006 L.V.PRASAD ఎల్.వి.ప్రసాద్ (1908 -1994) గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాదరావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత . ఈయన జనవరి 17 , 1908 న ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామమునందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించాడు. హిందీ , తమిళ , తెలుగు , కన్నడ పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు ఎల్.వి.ప్రసాద్ హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా , కాళిదాస్ భక్త ప్రహ్లాద మూడింటిలోనూ నటించిన ఘనత శ్రీ ఎల్ . వి గారిదే . ఎల్వీ ప్రసాదు స్మారకార్థం భారత తపాల శాఖ 2006 సెప్టెంబర్ 5 న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

2010 లో విడుదల చేసే తపాల బిళ్ళ ల వివరాలు

ఈఏడాది (2010) లో భారత తపాల శాఖా వారు విడుదల చేసే తపాల బిళ్ళ ల వివరాలు ఇచ్చారు . వీటిని పరిశీలించితే మన తెలుగు వారికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వలేదన్నది తెలుస్తూనే ఉంది . మహా కవి శ్రీ శ్రీ , ప్రఖ్యత పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు గార్ల శత జయంతుల సందర్బంగా వారి గౌరవార్దం తపాల బిళ్ళలు విడుదల చేసేలా కేంద్రంలో వత్తిడి తెచ్చే నాధుడే కరువైనారు . గుడ్డిలో మెల్ల లా చలన చిత్ర కధానాయక ల పై విడుదల చేస్తున్న ఆరు స్టాంప్స్ ( Legendary Heroines of Indian Cinema, 6 Stamps) లో మహానటి సావిత్రి కి చోటు దొరకటం మన అదృష్టం . India Stamp Issue Program - 2010 Jan 05: the Commonwealth Jan 1 6: Reserve Bank of India Jan 25: Election Commission Feb 21: Bible Society of India Feb 23: P C Sorcar Mar 19: 16 Punjab (2nd Patiala) Regiment Mar 30: Muthuramalinga Sethupathi Mar 30: Special Protection Group Mar 31: Vallal Pachaiyappa Apr 13: Sant Kanwar Ram Sahib Apr 14: Astrological Signs, 12 stamps Apr 17: Chandra Shekhar May 07...

బళ్ళారి రాఘవ

A Commemorative postage stamp on 31-10-1981 BELLARY RAGHAVA బళ్ళారి రాఘవాచార్లు ( 1880 -1946 ) లో అంతపురం జిల్లా తాడిపత్రి లో జన్మించాడు. వారు న్యాయవాదిగా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో, ప్రసిద్ధి చెందాడు. వారి ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. " రావు బహద్దూర్ " అన్న బిరుదు కూడా ఇచ్చింది.కానీ ఆయనకు నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభ ఉన్నాయి. బళ్ళారి రాఘవ నాటక ప్రదర్శనను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి అని అప్పట్లో కళాప్రియులు చెప్పుకొనేవారు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం ధారాళంగా వెచ్చించాడు. హావభావ ప్రకటనలోను, డైలాగులు చెప్పడంలోను రాఘవ అసమానుడనిపించుకొన్నాడు. విదూషక పాత్ర అయినా, మహారాజు పాత్రయినా రాఘవ అవలీలగా పోషించేవాడు. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషలన్నింటిలోనూ రాఘవ ప్రదర్శనలిచ్చాడు.హరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, బృహన్నల, రామరాజు చరిత్ర, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు - ఇవి ఆయనకు బాగా పేరు తెచ్చిన నాటకాలు. బళ్ళారి రాఘవ శ్రీలంక , ఇంగ్లాండ్ , ఫ్రాన్సు , జర్మని వంటి దేశాలు పర...

శ్యామశాస్త్రి

A commemorative postage stamp of SHYAMA SHASTRI ON 21 - 12 - 1985 శ్రీ శ్యామ శాస్త్రి ( 176 2 - 1827 ) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ( త్యాగయ్య , ముత్తు స్వామి దీక్షితులు ) మూ డవ వాగ్గేయ కారుడు. తమిళనాడు లోని తిరువారూరు గ్రా మస్థుడు . శ్యామ శాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము , ముద్దు గా శ్యామకృష్ణా యని పిలిచేవారు . అదే ఈయన కృతుల లో ఈయన ముద్ర అయినది . ఈయన కామాక్షి దేవి ఉపాసకుడు . ఆ దేవత పై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు . ఈయన కలగడ , మాంజి , చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు . తెలుగు,సంస్కృత భాషా కోవిదుదైన ఈయన కృతులలో ముఖ్యమైనవి : ఓ జగదంబా , హిమాచలతనయ , మరి వేరే గతి యెవ్వరమ్మా , హిమాద్రిసుతే పాహిమాం , శంకరి శంకురు , సరోజదళనేత్రి , పాలించు కామాక్షి , కనకశైలవిహారిణి , దేవీ బ్రోవ సమయమిదే , దురుసుగా , నన్ను బ్రోవు లలిత , మొదలగునవి . ప్రఖ్యాత వాగ్గేయకారుడైన సుబ్బరాయ శాస్త్రి వీరి కుమారుడే . వీరి గౌరవార్దం 1985 , డిసెంబర్ 21 న ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసారు .

దుర్గా భాయి

A commemorative postage stamp of Durgabai on 9- 5 - 1982 చట్ట సభలలో ౩౩ శాతం మహిళా రిజర్వేషన్స్ అమల జరగబోతున్న శుభ సమయాన మన తెలుగు మహిళ శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారిని మననం చేసుకుందాం . దుర్గాబాయి దేశ్‌ముఖ్ (జూలై 15, 1909 - మే 9, 1981) పేరు పొందిన తెలుగు స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు రచయిత్రి. చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను ఈవిడే స్థాపించారు. 1909లో కాకినాదలో జన్మించిన దుర్గాబాయి చిన్ననాటి నుండే స్వాతంత్ర్య పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డ పై గాంధీజీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు మారు ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందించింది. 1923లో కాకినాడలోని కాంగ్రెస్ సభలకు వాలంటీరుగా పని చేస్తూ నెహ్రుజీ వద్ద టిక్కెట్ లేని కారణము చేత ఆయనను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను ఆయన నుండి ప్రశంసలను పొందింది. ఆ పై మహాత్ముని ఆంధ్ర పర్యటనలలో ఆయన ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించింది. సంఘ సంస్కర్తగా బాల్య వివాహము, వరకట్నం వంటి దురాచారాలపై పోరాడింది. ఉప్పు సత్యాగ్...

త్యాగయ్య

A commemorative postage stamp of TYGARAJA - ON 6 - 1 - 1961 త్యాగరాజు ( 1767 - 1847 ) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు . నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు . కాకర్ల త్యాగ భ్రహ్మం పూర్వీకులు ప్రకాశం జిల్లా , కాకర్ల గ్రామమునుండి తమిళదేశానికి వలస వెళ్లారు . త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు . వీటిలో చాలావరకు ఆయన మాతృభాష తెలుగులో రచించబడినవి . కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్న కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి . వారి 1 14 వ వర్ధంతి ( జనవరి 6 , 1961 ) న ప్రతేక తపాల బిళ్ళ విడుదల చేసారు . ఇది మన తెలుగువారిపై విడుదలైన రెండవ తపాల బిళ్ళ .

అన్నమయ్య

A commemorative postage stamp on ANNAMACHARYA - 18th march 2004 పద కవితా పితామహుడు - వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచర్య గౌరవార్ధం 2004 మార్చ్ 18 న విడుదలైన ఐదు రూపాయల తపాల బిళ్ళ , ప్రత్యేక కవరు . చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసిన మన అన్నమయ్య కు ఈ తపాల బిళ్ళ ఒక నివాళి .