Skip to main content

తపాలబిళ్ళలపై తెలుగు వెలుగులేవి?


తపాల బిళ్ళ అనేది ఒక జాతి కీర్తి పతాకం. ఒక గౌరవ చిహ్నం. చరిత్రకు దర్పణం.తమ జాతిసంస్కృతి,సాంప్రదాయాలపైన,వేష భాషల పైన, కళలపైన, వైతాళికుల పైన ప్రత్యేక తపాలా బిళ్లలను ఆయా దేశాలు వారు ముద్రిస్తారు. వీటిని బట్టి ప్రపంచ వ్యాప్తంగాఉండే తపాలబిళ్ళల సేకరణకారులు ఆయ జాతి వైభవాన్ని తెలుసుకుంటారు. మరి మన తెలుగు జాతి సంస్కృతి కి చరిత్రకి మన దేశపు తపాలా బిళ్ళలు దర్పణం పడుతున్నాయా అన్నది ప్రశ్నార్ధకమే. మన పోస్టల్ శాఖ వారు వెలువరించిన తపాల బిళ్ళల గురించి తెలుసుకుంటే ఈ విషయంలో మన తెలుగువారిపై ఎంత వివక్ష ఉన్నదో అవగతం అవుతుంది. 

భారత ప్రభుత్వం ఇప్పటి వరకు వెలువరించిన షుమారు 2550 పోస్టల్ స్టాంప్స్ లో తెలుగు వారి పైన, తెలుగు జాతి సంస్కృతి పైన 68ఏళ్లలో విడుదల చేసిన తపాలా బిళ్లలు  కేవలం 50 లోపు మాత్రమే. విడుదల అయిన ఈ తపాల బిళ్ళల లో  కుడా మన వారి కృషి కంటే మన ప్రక్క న ఉన్న తమిళనాట ఉన్న  తెలుగు  సోదరుల కృషే ఎక్కువ. 
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి,  ప్రధాన మంత్రి వంటి వారికి, వారి మరణాన్తరం ప్రత్యేక తపాల బిళ్ళలు  విడుదల చేయటం ఆనవాయితి. కలాం గారికి ఈమధ్యే తపాల బిళ్ళ విడుదల చేసారు.  అయితే కీ.శే. పి.వి నరసింహారావు గారికి, నీలం సంజీవరెడ్డి గారికి ఇంతవరుకు పోస్టల్ స్టాంప్స్ విడుదల చేయలేదంటే వారిపట్ల, మన తెలుగు జాతి పట్ల ఎంత నిర్లక్షం  ఉందొ తెలుస్తూనే వుంది.
జ్ఞానపీట్  అవార్డ్ లు పొందిన హిందీ, బెంగాలి, తమిళ్, కన్నడ, మలయాళ వంటి అన్ని భాషా  కవులకు తపాలా బిళ్ళలు విడుదల చేసిన తపాలా శాఖ  వారు మన విశ్వనాధ సత్యనారాయణ, రావూరి భరద్వాజలను విస్మరించారు. దేశంలో ఉన్న ప్రముఖమైన పశుజాతి అంటూ విడుదల చేసిన నాలుగు తపాల బిళ్ళలలో మన ఒంగోలు జాతి గిత్త కు చోటు దక్కలేదు. ఇలా ఒక సమూహం లో విడుదల చేసే తపాల బిళ్లలో దక్షిణ భారత దేశం నుండి ఎప్పుడు తమిళనాడుకే స్థానం ఉంటుంది. దీనిని బట్టి తెలుగువారిపై   కేంద్రం చూపుతున్న  చిన్న చూపు అర్ధమోతుంది.  ఈ విషయంలో మన వారి నిర్లక్షం తేటతెల్లం అవుతుంది. 
స్వామి  నారాయణ తీర్థ, రామదాసు, క్షేత్రయ్య, సిద్దేంద్ర యోగి, పోతులూరి వీర బ్రహ్మం, ఆదిభట్ల నారాయణ దాసు, నాజర్,  శ్రీశ్రీ, జాషువా, కొసరాజు, నార్ల, సంజీవదేవ్, దామర్ల రామారావు, బాపు రమణ, అక్కినేని నాగేశ్వరరావు,  వంటి ఎందరో మహానుభావులు వారికి తపాలా బిళ్ళలు విడుదల చేయించాలన్న ఉహా ఈ మహనీయుల జయంతులు చేసిన/చేస్తున్న నిర్వహకులకు కాని ,ప్రభుత్వ పెద్దలకు కాని రాలేదు. 

అలాగే ఇంకా తెలుగు భాషకు, జాతి వికాసానికి సేవ చేసిన గిడిగు రామమూర్తి, కోడి రామూర్తి, సి. పి. బ్రౌన్, దార్శినికులు సర్ అర్ధర్ కాటన్, డా. కె.యల్. రావు, వాసిరెడ్డి ప్రసాదరాజా, వెలగపూడి రామకృష్ణ, డా.నాయుడమ్మ, స్వాతంత్ర యోధులు ఉయ్యాలవాడ నర్శింహా రెడ్డి, కన్నెగంటి హనుమంతు,  దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, కల్లూరి చంద్రమౌళి, కడప కోటిరెడ్డి, గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య వంటి మరి ఎందరో తెలుగు ప్రముఖులుకు శాశ్విత గుర్తుగా తపాలా బిళ్ళలు  విడుదల చేయించి  వారిని గౌరవించ వలిసిన బాధ్యత తెలుగు వారందరిపైన వుంది. 

తెలుగు వారి గత  వైభవాన్ని చాటే అమరావతి, లేపాక్షి, కాకతీయుల శిల్పకళకు, ఏటికొప్పాక, కొండవీటి బొమ్మలకు గుర్తింపు కలిగేలా తపాల బిళ్ళ వచ్చేలా  కృషి చేయాలి. ఉత్సవాల పేరుతో ఉరికే డబ్బు దుబారా చేయటం కాదు. కొద్ది కాలం మాత్రమే ఉండే  ప్రత్యేక సంచకలు ప్రచురిస్తారు కాని శాశ్వితంగా ఉండే తపాలా బిళ్ళను తిసుకురావాలన్న ఆలోచన మన వారికి కలగటం లేదు. చిత్త సుద్ది  లేని ఇలాంటి సభల నిర్వాహణ వల్ల  తెలుగు భాషకు, జాతికి మేలు జరుగుతుందని అనుకోవటం ఒక భ్రమ.

ఈ విషయంలో పోరుగునవున్న తమిళ సోదరుల నుండి ఉత్తేజం పొందాలి.
ఇప్పటికైనా కళ్ళుతెరిచి తెలుగు జాతి సంస్కృతి కి చరిత్రకి సంభందించిన తపాలా బిళ్ళలు కొన్నైనా కొత్త సంవత్సరంలో వచ్చేలా కృషి చేయాలి.తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచంలో చాటాలి. 


Comments

Konatham Dileep said…
చక్కని ప్రయత్నం. తెలుగు వారి తపాళా బిళ్లలే కాక ఇతర వాటిపై కూడా రాస్తున్నట్టున్నారు?

కొణతం దిలీప్
hridayam.wordpress.com
kodali srinivas said…
మీ అభిప్రాయం చెప్పినందులకు ధన్యవాదాలు

Popular posts from this blog

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

కవి రాజు త్రిపురనేని రామస్వామి- 125వ జయంతి

ఈ ఏడాది  కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి  125 వ జయంతి సంవత్సరం.  1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులో పుట్టిన త్రిపురనేని   తెలుగు నాట హేతువాద భావాలు వెదజల్లిన వైతాళికుడు.  కవి రాజు గారి  125 వ జయంతి సంవత్సరంలో  వారు చూపిన హేతువాద మార్గం లో సమాజం ముందుకు పోయేలా అభుదయ వాదులు, హేతువాదులు కృషి చేయాలి. వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ తిరిగి ప్రతిస్టించేలా కృషి చేయాలి. 1987 లో వారి  శత జయంతి సందర్బంగా మన తపాలా శాఖ  ఒక ప్రతేక తపాల బిళ్ల (ఇండియా స్వతంత్ర పోరాటం - ఫిఫ్త్ సిరీస్ లో భాగంగా) 60 పైసల స్టాంప్ విడుదల చేసింది. T . RAMA SWAMY CHOWDARY Date of Issue :25 -04-1987 తెలుగు నాట హేతువాదభావాలను వెదజల్లిన హేతువాది, వైతాళికుడు,కవిరాజుగా ప్రసిద్ధి చెందిన  త్రిపురనేని రామస్వామి  (1887-1943) గొప్ప సంఘసంస్కర్త, స్వతంత్ర యోధుడు. తెనాలి లో వారు స్థాపించిన ' సూతాశ్రమం' అనేక సంస్కరణ ఉద్యమాలకు  కేంద్రంగా  భాసిల్లింది.  ప్రజలను   మేలుకొలిపే   హేతువాద   భావాలను   వ్యక్తపరచడానికి   సాహి...