కందుకూరి వీరేశలింగం పంతులు (1848 -1919)- తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి. ఎన్నో నాటకాలు రాసిన కవి. ఏప్రియల్ 16 న జరిగే వీరి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగస్థల కళాకారుల దినోత్సవంగా జరుపుతున్నది.
ఆయనకున్న ఇతర విశిష్టతలుమొట్టమొదటి సహవిద్యా పాఠశాలను ప్రారంభించాడు
తెలుగులో మొదటి స్వీయ చరిత్ర , తెలుగులో తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర మరియు తొలి ప్రహసనం రాసింది కుడా కందుకూరే .
Comments