ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం గా కీర్తించబడే మన దేశంలో త్వరలో సాధారణ ఎన్నికలు (లోక్ సభ) వాటితో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. మంచి పాలకులు వస్తేనే ఈ దేశం , ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి.
మతానికి, కులానికి, ప్రాంతానికి, ధనానికి, దర్పానికి లొంగకుండా నిర్బయంగా ,వివేకంగా మన పాలకులను ఎన్నుకోవాలి.
స్వాతంత్రం వచ్చి 67 ఏళ్ళు గడిచినా ఇంకా ఈ దేశం లో ఎవరికీ ఓటు వేయాలో , ఎటువంటి నాయకులను అధికార పీటం పై ఉంచాలో మనం తెలుసుకోలేక పోవటం శోచనీయం.
దొంగలు, దోపిడిదారులు, అవినీతి జలగలు, పుండాకోర్లు, దగాకోర్లు దర్జాగా మన ముందుకు ఓట్లు అడగటానికి వస్తున్నారు అంటే మనం ఎంతగా దిగజారి పోయి ఉన్నామో అర్ధం చేసుకోండి.
ఓటు విలువ పామరులకు తెలియజేయాటానికి అందరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే విషయానికి విస్తృతం గా ప్రచారం చేయటానికి మన తపాలా శాఖ 1967 లో జరిగిన సాధారణ ఎన్నికల సమయం లోనే ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను 13-1-1967 న విడుదల చేసింది. 57 ఏళ్ళు అయినా మనలో ఏమాత్రం చైతన్యం వచ్చినట్లు కనపడుటం లేదు.
అప్పుడు సాంబారు ఇడ్లీకి, సారా బుడ్డికి ఓటు అమ్ముకున్న అమాయకులను చూసాం. నేడు అమాయకులు లేరు కాని ఆనాటి కంటే ఈనాడు ఇంకా ఎక్కువ మంది రకరకాల ప్రలోబాలకు లొంగి తమ ఓటును అమ్ముకుంటున్నారు. ఈ తీరులో పెను మార్పు రావాలి.
|
General Election – Indian Stamps depicting Voters, Polling Booth |
ఈ ఎన్నికలు అధికారం లో ఉన్న వారికి , లేని వారికి ఇద్దరికీ సమ న్యాయం కల్పిస్తూ, పక్షపాత రహితంగా, రాగ ద్వేషాలకు తావు లేకుండా వివాద రహితంగా జరిపించేది మన భారత ఎన్నికల సంఘం. చాలావరకు ఇది తన కర్తవ్యాన్ని చేస్తూనే ఉంది. కాని దానిని చేతానా రహితంగా చేసే రాజకీయం నేడు ప్రభిలింది.
1950 లో ఏర్పడిన ఈ సంఘం తన విడిలో 60 సంవత్సారాలు పూర్తి చేసుకున్న వేళ 25-01-2010 లో ఒక తపాల బిళ్ళ విడుదల చేసారు.
|
60 YEARS OF ELECTION COMMISSION OF iNDIA |
ఎన్నికల సంస్కరణ లో ఎన్నికల సంఘం పాత్ర తో పాటు ఓటరుగా మన పాత్ర కుడా చాలా ఉంటుందన్న సంగతి గమనించాలి. ఏదో ఒక విదంగా గెలవాలి, తరువాత దోచుకోవాలి అనే దోపిడి నాయకులకు బుద్ది వచ్చేలా మన ఓటు తో చెప్పాలి. దుర్మార్గుల దౌష్ట్యం కన్నా మంచి వారి మౌనం సమాజానికి చెడు చేస్తుంది. లక్షల కోట్ల అవినీతిని చూస్తూ ఇంకా మౌనం ఉండటం మంచిది కాదు. తప్పు ని తప్పు గా చెప్పలేక పోవటం కుడా తప్పే. తప్పును సమర్దించటానికి మరొక తప్పు ఎత్తి చూపటం దుర్మార్గులు చేసే పని. సమయం వచ్చింది. మేలుకో
ఓటు విలువ తెలుసుకో -బతుకులో వెలుగు నింపుకో !
Comments