India Post Issued a postage stamp to commemorate 50 years of De Facto Transfer of Pondicherry( yanam) on 27 December 2005
De Facto Transfer of Pondicherry( yanam) |
Date of Issue :27 December 2005
పుదిచ్చేరి రాష్ట్రం లో అంతర్ భాగం గా ఉన్న యానాం మన రాష్ట్రం లోని కాకినాడకు సమీపంలో ఉన్న తెలుగు ప్రాంతం. ఆంగ్లేయులనుండి భారత దేశానికి 1947 లో స్వాతంత్ర్యం వచ్చినా యానాం జూన్ 13 1954 వరకు ఫ్రెంచు వారి ఆధీనంలోనే ఉండి పోయింది. యానాంలో 1954 లో జరిగిన "భారత సైనిక దాడి" యానాం గతినే మార్చివేసినది.1954 జూన్ 27న యానాం ప్రజలు విమోచన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. ఇరవై ఒక్క తుపాకుల కాల్పుల అనంతరం మద్దింశెట్టి సత్యానందం ఫ్రెంచి పతాకాన్ని అవనతంచేసి భారత పతాకాన్ని ఎగురవేసారు.
నవంబరు 1 1954 న ఫ్రెంచి స్థావరాలను( పుదుచ్చేరి, యానాం, కారైకాల్, మాహే) భారతదేశమునకు వాస్తవికాంతరణ ( De-facto Tracfer) చేయబడినవి . కాని విధితాంతరణ (De-jure transfer) మాత్రము ఆగష్టు 16 1962 లొ జరిగినది. ప్రతీ సంవత్సరము, ఈ దినమును విధితాంతరణ దినముగా వేడుకలు జరుపుకుంటారు.
Comments