మన తపాలా శాఖ 19-12-2019 న ఎంబ్రాయిడరీస్ అఫ్ ఇండియా పేరుతో 12 తపాలా బిళ్ళలు, ఒక మినియేచర్ ను విడుదల చేసింది. వీటిలో 10 రూపాయల తపాలా బిళ్ళలు ఐదు , 15 రూపాయల తపాలా బిళ్ళలు మూడు, 20 రూపాయల తపాలా బిళ్ళలు నాలుగు ఉన్నాయి. మన దేశంలో వివిధ ప్రాంతాలలో వాడుకలో ఉన్న ఎంబ్రాయిడరీస్ రూపురేఖలు తీసుకొని వాటితో ఈ తపాల బిళ్లలను రూపొందించారు. వీటిలో మన ఆంధ్రాలో 500 ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న ముద్ద అల్లిక (కమల్ కథై )కు స్థానం కల్పించారు. చేతిగుడ్డ, దిండు గలీబు, ద్వారాలకు తెర గుడ్డలు, వస్త్రాలకు వివిధ రకాల చిత్రాలు, పూలు, ఆకులు, జంతువులు పక్షులు వంటివి సూదితో రంగుల దారాలతో ఉబ్బెత్తుగా (3D) చాలా అందంగా అల్లటం దీని ప్రతేకత. Embroideries of India ఆంధ్రా అల్లిక (కమల్ కథై ) అద్దాల కుట్టు పని (అప్లిక్యూ) మన ఆంధ్ర, తెలంగాణా లలో నివసించే లంబాడి (బంజారా తెగ) స్త్రీలు వాడే దుస్తులకు అద్దాలు అమరిచ్చి అందంగా తయారు చేసే కుట్టు పని (అప్లిక్యూ) కూడా ఒక తపాలా బిళ్ళ విడుదల చేసారు.
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.