On the occasion of Dr. B. R. Ambedhkar 126 birth anniversary India Post released a Se-tenant stamp on Deekshabhoomi on 14th April 2017 at Nagpur.
డా. బి.ఆర్. అంబేద్కర్ 126 వ జయంతి సందర్భంగా మన తపాలా శాఖ 14-04-2017న ఒక సి-టెనెంట్ (జంట -బిళ్ళలు) దీక్షాభూమి పేరుతో విడుదల చేసింది. అశోక విజయ దశమి (14-10- 1956) న నాగపూర్ లో అంబేద్కర్ తన అనుచరులతో కలసి బౌద్ధం స్వీకరించిన ప్రదేశం లో నిర్మించిన బౌద్ధ ఆరామం ఈ దీక్షాభూమి.
On the view of APPEX-88, A Special cover issued by Indian Post on Rani Rudrama Devi of Kakatiya Dynasty on 8-06- 1988. తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ 8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది. దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు. దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు. Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు. రాణి రుద్రమ దేవి అసమాన ధైర్య సాహసాలతో ఆనాటి ఆంధ్రదేశమంతటినీ సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో ఒక మహిళగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

Comments