India post Issued a Special Cover in Centenary celebrations of Guntur District Formation on 1- 10 -2004.
Guntur district Formation Centenary |
గుంటూరు జిల్లా అవతరణ జరిగి 100 వసంతాలు (1904 లో కృష్ణ జిల్లా నుండి విభజించబడినది) నిండిన సందర్బం గా శతాబ్ది ఉత్సవాలు జరిపినప్పుడు మన తపాలా శాఖ 1-10-2004 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు. దానిపై గుంటూరు జిల్లా కు ప్రాశస్తాన్ని కలిగించిన చారిత్రిక చిహ్నాలను ముద్రించారు. ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధస్థూపంగల అమరావతి, అనంతపద్మనాభస్వామి కి అంకితమివ్వబడిన గుహలు గల ఉండవల్లి గుహలు, కొండవీటి కోట,నాగార్జున సాగర్ ఆనకట్ట ,ఎత్తిపోతల జలపాతం,ఉప్పలపాడు పక్షుల వలస కేంద్రం ,శాతవాహన చక్రవర్తి వాసిష్టి పుత్ర శ్రీ పులుమావి వినియోగించిన నాణేలు దీనిపై ఉన్నాయి. గుంటూరు పేరుతో ఖ్యతి చెందిన గోంగూర, మిరపకాయ,పొగాకు పంటలను సూచిస్తూ వాటి ఆకులు దీనిపై చూడవచ్చు. ఈ కవరు పై ఉపయోగించుటకు ఈ జిల్లా స్వరూపాన్ని చూపే మ్యాపు తో ప్రత్యేక తపాలా ముద్ర ను రూపొందించారు.
గుంటూరు జిల్లా చరిత్ర
గుంటూరు జిల్లాకు అతి పురాతనమైన చరిత్ర ఉంది. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు పరిపాలించారు. ఆ పిమ్మట మొగలు సామ్రాజ్యం, నిజాం పాలనల లో ఉంది. ఆ తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీల పాలన లో మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైనది.ఈ గడ్డ పై ఒకప్పుడు బౌద్ధం విలసిల్లింది. చరిత్ర ప్రసిద్ది పొందిన పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది. భారత స్వాతంత్ర్య సమరంలో చీరాల - పేరాల, పెదనందిపాడు పన్నుల ఎగవేత, సైమన్ కమీషన్ వుద్యమం,తెనాలి క్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఎన్నో చారిత్రకఘట్టాలు ఈ జిల్లాలో జరిగాయి. స్వతంత్ర యోధులు ఆచార్య రంగా, కల్లూరి చంద్రమౌళి, వావిలాల, కవిత్రయం లోని తిక్కన, జాషువ,జంద్యాల పాపయ్యశాస్త్రి, కొసరాజు, తుమ్మల సీతారామమూర్తి వంటి కవులు,చిత్రకారుడు సంజీవదేవ్ ఈ జిల్లాకు చెందిన వారే.
గుంటూరు జిల్లా మ్యాపు తో తపాలా ముద్ర ఉన్న పోస్ట్ కార్డ్ |
Comments