Skip to main content

Posts

Showing posts from 2012

చిట్టి రాయబారులు -నా తపాలా బిళ్ళల సేకరణ

నాల్గోవ ప్రపంచ తెలుగు మహా సభలు సందర్బంగా  'చిట్టి రాయబారులు'  ఆకట్టుకుంటున్న తపాలా బిళ్ళల సేకరణ  అనే శీర్షిక తో 26-12-2012 న ఈనాడు దినపత్రిక  గుంటూరు జిల్లా సంచికలో ఒక వార్తా కధనం వచ్చింది. ఈ వార్తా కధనం లో నేను 1984 నుండి సేకరించిన తపాలా బిళ్ళల గురంచి, వాటిలో తపాలాబిళ్లల పై మన తెలుగు భాష, సంస్కృతి, జాతి వెలుగులు గురించి, స్టాంప్స్ ఆఫ్ ఆంధ్ర బ్లాగు గురించిన వివరాలు ప్రచురించారు. పూర్తి వివరాలకు కింది చిత్రాన్ని క్లిక్ చేయండి. News in Eenaadu- Prof.Kodali Srinivas Link  : http://eenadu.net/district/inner.aspx?dsname=Guntur&info=gnt-panel3

ఆచార్య నాగార్జునుడు

India post Issued a Special Cover in  Decennial celebrations of  Guntur Numismatic & Philatelic Society ( GNPS )on 4- 12 -2004. The  cancellation on cover Shows the Statue of Acharya Nagarjunudu. GNPS - దశాబ్ది ఉత్సవాల సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక తపాలా కవర్ Acharya Nagarjuna (150-250 CE)  is widely considered the most important Buddhist philosopher. H e is credited with founding the  Madhyamaka  school of  Mahayana  Buddhism .   He is traditionally supposed to have written several treatises on  rasayana   alchemy  as well as serving a term as the head of  Nalanda  University. Acharya Nagarjuna Statue  is often depicted in composite form comprising human and  naga  characteristics. Often the naga aspect forms a canopy crowning and shielding his human head. The notion of the naga is found throughout Indian religious culture, and In Buddhism, it is a syno...

దీప స్తంభాలు - Light Houses of India

India Post issued Two stamps and   Miniature sheet  , featuring Light Houses of India on 23 December 2012 with face value Rs 20 and Rs 5.  These stamps depicts Light House of Alleppey and Mahabalipuram.   Light House of Alleppey and Mahabalipuram భారత తపాలా శాఖ 23-12-2012 న కేరళ లో ఉన్న అలెప్పి, తమిళనాడు లో ఉన్న మహాబలి పురం  లలో గల దీప స్తంభాలు(Light Houses) ఇతివృత్తంగా అందమైన ఒక లఘు బొమ్మ (మినియెచర్) మరియు రెండు తపాలా బిళ్ళలు విడుదలచేసింది.

కాకతీయులకు గుర్తింపు ఏది?

శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.  తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు.   కాకతీయ సామ్రాజ్యము( 1083-1326 )వెల్లివిరిసిన  కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి.   కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత రాణి రుద్రమ దేవి. కాకతీయ సామ్రాజ్యం 14వ శతాబ్దపు తొలి సంవత్సరములలో తురుష్కుల దాడిని పలుమారులు ఎదిరించి చివరకు క్రీ. శ. 1323 లో రెండవ ప్రతాప రుద్రుని మరణంతో పతనమయ్యింది. ఆ తరువాత కాకతీయుల సేనానులు  ముసునూరు నాయకులు 1326 లో తిరిగి తురుష్కులను పారదోలి 1370 వరకు ఓరుగల్లును పాలించారు. ముసునూరి కాపయ నాయకుని మరణంతో  వైభవాన్ని కోల్పోయి ఈ ప్రాంతం ముస్లిం పాలకుల చేతికి వచ్చింది. తరువాత  బహుమనీ సుల్తానులు ,  గోల్కొండ  సుల్తానులు, మొఘలు పరిపాలకులు,  నిజాం  సుల్తానులు ఏలుబడిలోకి వచ్చి పోలిస్ ...

గణితమేధావి శ్రీనివాస రామానుజన్

Every  year December 22, the birthday of    Srinivasa Ramanujam is celebrated as ‘ National Mathematics Day.’    In view of this   India Post released a commemorative  postal  stamp on   on   22-12-2012. National Mathematics Day Date of  Issue :  22 December 2012  జాతీయ గణిత దినం సందర్బంగా మన భారత తపాలా శాఖ వారు 22-12-2012 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళ పై నంబర్ థియరీ తో శ్రీనివాస రామానుజం చిత్రాన్ని ముద్రించారు. Srinivasa Ramanajan - First Day Cover ఈ తపాలా బిళ్ళ నిజానికి  డిసెంబర్ 22,2011 న విడుదల కావలిసి ఉండగా దానిని అర్దాంతం గా నిలిపి మరొక ప్రత్యేక తపాలా బిళ్ళ శ్రీనివాస రామానుజం గారికి విడుదల చేసారు. ఇలా ఎందుకు చేసారో తెలియదు. బహుశ దానిపై రాముజం పేరు లేకపోవటం కారణం కావచ్చు.(తప్పు ఉంటె తమిళ సోదరులకు చిర్రెతుకొస్తుంది) కొంత మంది డీలర్లు ఈ తపాలా బిళ్ళను నిరుడే పోస్ట్ ఆఫీసు నుండి లోపాయకారిగా సేకరించి దానితో వ్యా...

కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు

A Special Cover On KALIYUGA  BHIMA KODI RAMAMURTHI  by India Post  on 28 -1- 1995  కోడి రామ్మూర్తి నాయుడు మన భారత తపాలా శాఖ వారు  VIZNUPEX-'95 విజయనగరం లో జరిగిన సందర్బంగా  కలియుగ భీముడు  కోడి రామ్మూర్తి నాయుడు గారికి నివాళిగా28-01-1995 న ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసారు. ఈ ప్రత్యేక కవర్ పై ఉపయోగించటానికి విజయనగరం రాజకోట తో ప్రత్యేక తపాలా ముద్రను రూపొందించారు.  కోడి రామ్మూర్తి నాయుడు  (1885 - 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు, సర్కస్ వీరుడు. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్రలో  ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది.  ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన  తెలుగువారిలో  అగ్రగణ్యులు.  వీరు  శ్రీకాకుళం   జిల్లా  వీరఘట్టంలో  జన్మించారు.  మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్...

గుంటూరు జిల్లా చరిత్ర

India post Issued a Special Cover in  Centenary celebrations of  Guntur  District Formation on 1- 10 -2004. Guntur  district Formation Centenary  గుంటూరు జిల్లా అవతరణ జరిగి 100 వసంతాలు (1904 లో కృష్ణ జిల్లా నుండి విభజించబడినది) నిండిన సందర్బం గా  శతాబ్ది ఉత్సవాలు జరిపినప్పుడు మన తపాలా శాఖ 1-10-2004 న  ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు. దానిపై గుంటూరు జిల్లా కు ప్రాశస్తాన్ని కలిగించిన చారిత్రిక చిహ్నాలను ముద్రించారు.   ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధస్థూపంగల  అమరావతి , అనంతపద్మనాభస్వామి కి అంకితమివ్వబడిన గుహలు గల  ఉండవల్లి గుహలు, కొండవీటి కోట,నాగార్జున సాగర్ ఆనకట్ట ,ఎత్తిపోతల జలపాతం,ఉప్పలపాడు పక్షుల వలస కేంద్రం ,శాతవాహన చక్రవర్తి వాసిష్టి పుత్ర శ్రీ పులుమావి వినియోగించిన నాణేలు దీనిపై ఉన్నాయి. గుంటూరు పేరుతో ఖ్యతి చెందిన  గోంగూర, మిరపకాయ,పొగాకు పంటలను సూచిస్తూ  వాటి ఆకులు దీనిపై చూడవచ్చు. ఈ కవరు పై ఉపయోగించుటకు   ఈ జిల్లా స్వరూపాన్ని చూపే మ్యాపు తో ప్రత్యేక తపాలా ముద్ర ...

యూరోపు దేశపు తపాలా బిళ్ళ పై తెలుగు అక్షరం

  Telugu alphabet on EUROPA stamp   Date of Issue: 9th May 2008 ఈ ఇంటర్నెట్ యుగం లో ఉత్తరాలు రాయటం దాదాపుప్రపంచ వ్యాప్తంగా  అంతరించి పోతున్నది. ఉత్తరం రాయటం ఒక కళ. దీనివల్ల పిల్లలకు  భాషపై  పట్టును ఇస్తుంది. అవసంరం ఉన్న లేకున్నా పిల్లలలో ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించావలిసిన భాద్యత పెద్దలపై , ఉపాధ్యాయుల పై ఉంది. ఈ మంచి ఉద్దేశంతో పిల్లలలో ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించటానికి యూరోపా దేశాలు 2008 లో 'లెటర్ రైటింగ్' అనే అంశం పై తపాలా బిళ్ళ లు విడుదల చేసాయి.  ఈ అంశం పై విడుదలైన తపాలా బిళ్ళ లలో యూరోపా దేశాలలో ఒకటైన  'అన్డోరా' దేశం విడుదల చేసిన తపాలా బిళ్ళ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ తపాలా బిళ్ళ ను   ప్రపంచం లో ఉన్న ప్రధాన భాషల లో గల మొదటి అక్షరం ఉండేలా రూపొందించి బడినది.  అందంగా ఉన్న ఈ  తపాల బిళ్ళ పై  అనేక ముఖ్య భాషా అక్షరాల తో పాటు మన   తెలుగు అక్షరం ' అ ' కు కుడా  స్థానం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే మన తెలుగు భాషకు సముచిత...

తపాళ బిళ్ళ పై తెలుగు అక్షారాలు

సాదారణంగా మన తపాలా బిళ్ళ ల పై హిందీ మరియు ఇంగ్లీష్ భాష లలో వాటిని గురించిన  వివరాలు ముద్రించబడి ఉంటాయి. అరుదుగా  కొన్ని సందర్బాలలో మన ప్రాంతీయ బాషలు కుడా వాటిపై  చోటుసేసు కుంటాయి. అలా మన తెలుగు అక్షరాలు మన భారత దేశ తపాల బిళ్ళల పై మూడు సార్లు చోటు చేసుకున్నాయి. తపాళ బిళ్ళ పై తెలుగు అక్షారాల వివరాలు. మొదటి సారి  16- 10 -1972 లో భారత తపాలా శాఖ విడుదల చేసిన  ఆంద్ర  కేసరి టంగుటూరి ప్రకాశం గారి స్మారక తపాలా బిళ్ళ పై ప్రకాశం పంతులు గారు   తెలుగులో పెట్టే సంతకం  'టం.ప్రకాశం' ముద్రించ బడినది. ప్రకాశం గారి సంతకం తో ఉన్న తపాలా బిళ్ళ  రెండో సారి  12-4- 1975 న  ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభల సందర్బం గా విడుదలైన తపాల బిళ్ళ పై  ' దేశ   భాషల   యందు   తెలుగు   లెస్స  ' అన్న   శ్రీ   కృష్ణ   దేవరాయల   పలుకులు ,  'ఎందరో   మహానుభావులు   అందరికి   వందనములు'   అన్న   శ్రీ   త్యాగరాజ   స్వామి   కృతి   పదాలు త...

ప్రపంచ తెలుగు మహా సభలు

ఒక జాతి సంస్కృతిని, సాహిత్యాన్ని,  వైభవాన్ని,ఔన్యత్వాన్ని,చరిత్రను  పది కాలాల పాటు ప్రపంచం నలువైపులా  చాటి చెప్పేవి తపాలా బిళ్ళలే. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానంగా, అపురూపంగా దాచుకొనే తపాళా బిళ్ళల ప్రాముఖ్యం చెప్పనలవి కానిది. తపాల బిళ్ళ ఒక గౌరవ చిహ్నం. అంగరంగ వైభవం గా  1975 లో ప్రపంచ తెలుగు మహా సభలు తొలి సారి హైదరాబాదు లో జరిగినప్పుడు మన పోస్టల్ శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేశారు. ఆనాటి సభలకు తీపి గుర్తుగా అనేక మంది తపాలా బిళ్ళల సేకరణ దారుల వద్ద పదిలంగా బద్రపరచ బడినవి. ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు  హైదరాబాద్   లో   12  - 04  - 1975   న( ఉగాది పర్వదినాన )   ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభలు   జరిగినప్పుడు  మన భారత తపాల శాఖ వారు ఒక  ప్రత్యేక   తపాల   బిళ్ళ  ను  విడుదల   చేసారు .  ఈ   తపాల   బిళ్ళ   వెల   25   పైసలు .  దాని పై చదువుల తల్లి సర్వస్వతి చిత్రం దాని వెనుక తెలుగు పదాలు ముద్రించారు.  A Commemorative posta...

వినియోగదారుల రక్షణ చట్టం -1986

On completion of 25 years of Consumer Protection Act -1986 , India Post released a postal stamp on  29th November 2012 Consumer Protection Act of 1986  is an Indian federation law enacted in 1986 to protect interests of consumers in  India . It makes provision for the establishment of consumer councils and other authorities for the settlement of consumers  disputes and for matters connected therewith. Consumer Protection Act of 1986  వినియోగదారుల రక్షణ చట్టం -1986  సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం   కేంద్ర ప్రభుత్వం  వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) ను  1986 లోరూపొందించ బడినది.దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు యొక్క నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉండే దానివలన కలిగే ఆర్ధిక మరియు ఇతర నష్టాలను ఆ వస్తువును తయారుచేసిన సంస్థ భరించాల్సి వుంటుంది. దీనికి సంబందించిన తగాదాల పరిష్కారం కొరకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక న...

2050 లో మన పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుంది?

ప్రతి సంవత్సరం నవంబర్ 14 న నెహ్రు గారి జయంతి ని మన జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రతి బాలల దినోత్సవానికి మన తపాలా శాఖా వారు ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేస్తారు. దానిపై మన బాల,బాలికలకు దేశ వ్యాప్తంగా ఒక అంశం పై చిత్ర లేఖన పోటి లు నిర్వహించి వాటిలో ప్రధమ స్థానం పొందిన చిత్రాన్ని ఈ తపాల బిళ్ళ పై ముద్రిస్తారు.  అలాగే ఈ ఏడాది ' 2050 లో మన పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుంది?' అనే అంశం పై తపాల శాఖ వారు నిర్వహించిన చిత్ర లేఖన పోటిలో ప్రధమ బహుమతి పొందిన చిత్రాన్నిఈ ఏడాది బాలల దినోత్సవం   14-11-2012 న ప్రత్యక తపాలా బిళ్ళ గా  విడుదల చేసారు.   childern's day-2012 India Post released a stamp on 14th November 2012 to commemorate Children's day. As usual the stamp is based on the drawings made by children in a stamp Design competition organised by the Department of Posts.The theme of the competition this year was 'Post Office 2050'.

సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు

Dr . DWARAM VENKATASWAMY NAIDU India post Issued a   Commemorative   postage   stamp  on   8-11-1983. ద్వారం వెంకటస్వామి నాయుడు (1893 - 1964 ) గొప్ప వయెలిన్ (వాయులీనం) విద్వాంసుడు. భారత ప్రభుత్వం వీరికి  1957 లో పద్మశ్రీ అవార్డ్ ప్రధానం చేసింది. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం 'మహారాజా సంగీత కళాశాల'లో వయొలిన్ ఆచార్యునిగా చేరి, 1936లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు.వయోలిన్ వాయిద్యంతో ఒంటరిగా  కచేరీలు (solo concerts, అంటే వయొలినే ప్రధాన సాధనంగా) ఇచ్చి వయోలిన్ కి విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చారు. కర్ణాటక సంగీతంలో ఉన్న కీర్తనలను వయొలిన్‌పై వినిపించవచ్చునని చూపించిన మొదటి వ్యక్తి కూడా ఇతనే. సంగీతం అనేది " వివిపించే తపస్సు " అనీ, ఏరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ   తన శిష్యులకు చెప్పేవాడు. సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడి గారి శతజయంతి సందర్బంగా ( 8 - 11 - 1993 ) న మన తపాల శాఖ  ఒక ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసారు . First day cover

విజయ దశమి -Dussehra

అందరికి దసరా శుభాకాంక్షలు చెడుపై, దుర్మార్గం పై మంచి,మానవత్వం సాదించిన విజయాలకు గుర్తుగా మనం జరుపు కునే పండుగే  దసరా పండుగ. మన దేశం లో   హిందువులు జరుపుకునే ఈ ముఖ్యమైన విజయ దశమి  పండుగకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించి తపాల శాఖ వారు 7-10-2008 న  రెండు  ప్రత్యేక తపాల బిళ్ళలను,వీటితో పాటు ఒక మినిఎచార్ ను విడుదల చేసారు. దసరా పండుగ రోజుల్లో కొలకొత్త లో వైభవంగా జరిగే దుర్గా పూజా ను సూచిస్తూ ఒకటి , మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాలు సూచిస్తూ  మరొకటి  తపాలా బిళ్ళలు విడుదల చేసారు. బాలల దినోత్సవం సందర్బంగా 14-11-2005 లో దసరా ఊరేగింపు పై ఒక తపాల బిళ్ల విడుదలైంది.