Skip to main content

Statue of Buddha

A special cover Issued by India Post on 16-10-2003 in APPEX - 2003. The cover and cancellation Shows the Statue of Buddha in Hussen sagar,Hyderabad.
హైదరాబాద్ లో ఉన్న  హుస్సేన్ సాగర్‌లో ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. తెలుగు వారికి దశ,దిశ చూపిన  శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రోద్బలం తో అనేక మంది  శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం స్థాపన సమయంలో నీట మునిగింది. మళ్ళీ డిసెంబరు 1992లో దీనిని వెలికితీసి  'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన  ప్రతిష్టించారు. ఈ చెరువు గట్టుపై (టాంక్ బండ్) తెలుగు జాతి లో విశిష్టమైన స్థానం కలిగిన 33 మహనీయులు విగ్రహాలు ఉన్నాయి.

Comments

Popular posts from this blog

రాణి రుద్రమ దేవి

On the view of APPEX-88,   A Special cover issued  by Indian Post  on Rani Rudrama Devi of Kakatiya Dynasty  on 8-06- 1988.  తిరుపతి లో APPEX -88 (A.P తపాలా బిల్లల ప్రదర్సన) సందర్బం గా మన తపాల శాఖ  8-6-1988 న ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసింది.  దానిపై కాకతీయ సామ్రాజ్య పట్ట మహిషి, అసమాన పరాక్రమ శాలి రాణి రుద్రమదేవి చిత్రాన్ని ముద్రించారు.  దీనికి తపాలా ముద్రగా లేపాక్షి స్థంబాల పై ఉన్న చిత్రాన్ని ఉపయోగించారు.  Special cover on Rani Rudramadevi of Kakatiya Dynasty రాణి రుద్రమ దేవి : 1269-1289 కాకతీయ చక్రవర్తి గణపతిదేవునికి పుత్రులు లేనందున రెండవ కూతురు రుద్రమదేవికి పురుషోచిత విద్యలు నేర్పి "రుద్రదేవ మహారాజు"గా సింహాసనాన్ని అప్పగించాడు.  రాణి రుద్రమ దేవి  అసమాన ధైర్య సాహసాలతో  ఆనాటి ఆంధ్రదేశమంతటినీ  సమర్ధవంతంగా పరిపాలించి చరిత్రలో  ఒక మహిళగా  సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. 

రేడియో అన్నయ్య

Special Cover on NYAYAPATHI RAGHAVARAO by Indian Post  Date of Issue: 23-4-2005  న్యాయపతి రాఘవరావు (1905 - 1984) రేడియో అన్నయ్యగా ప్రసిద్దుడు, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు, బాలసాహిత్యవేత్త, బాలబాలికల శ్రేయస్సు, సాంస్కృతిక వికాసానికి తన జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్త, కళాకోవిదుడు మరియు రచయిత. పాఠశాల చదువు అనంతరం విజయనగరం లోని మహారాజ కళాశాల లో డిగ్రీ పూర్తిచేసి మద్రాసు లో పత్రికా విలేఖరిగా జీవితం ప్రారంభించాడు. పది సంవత్సరాల పాటు జర్నలిస్టుగా పనిచేసి, దానికి రాజీనామా చేసి. ఆకాశవాణి లో కాంట్రాక్టు పద్ధతిపైన చేరాడు. అక్కడ చేరిన తరువాత చిన్నపిల్లల కార్యక్రమాలను ప్రతి వారం నిర్వహించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ కార్యక్రమం నిర్వహిస్తూ క్రమంగా రాఘవరావు రేడియో అన్నయ్య గా పేరొందాఋ. ప్రతి ఆదివారం ఆటవిడుపు అనే కార్యక్రమం ప్రారంభించి, తెలుగు బాల బాలికలను రారండోయ్ రారండోయ్........ పిల్లల్లారా రారండోయ్ అంటూ పిలుపు నిచ్చాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఆయన శ్రీమతి న్యాయపతి కామేశ్వరి  అండగా నిలిచి ఆ కార్యక్...

కవి రాజు త్రిపురనేని రామస్వామి- 125వ జయంతి

ఈ ఏడాది  కవిరాజు త్రిపురనేని రామస్వామి గారి  125 వ జయంతి సంవత్సరం.  1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులో పుట్టిన త్రిపురనేని   తెలుగు నాట హేతువాద భావాలు వెదజల్లిన వైతాళికుడు.  కవి రాజు గారి  125 వ జయంతి సంవత్సరంలో  వారు చూపిన హేతువాద మార్గం లో సమాజం ముందుకు పోయేలా అభుదయ వాదులు, హేతువాదులు కృషి చేయాలి. వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ తిరిగి ప్రతిస్టించేలా కృషి చేయాలి. 1987 లో వారి  శత జయంతి సందర్బంగా మన తపాలా శాఖ  ఒక ప్రతేక తపాల బిళ్ల (ఇండియా స్వతంత్ర పోరాటం - ఫిఫ్త్ సిరీస్ లో భాగంగా) 60 పైసల స్టాంప్ విడుదల చేసింది. T . RAMA SWAMY CHOWDARY Date of Issue :25 -04-1987 తెలుగు నాట హేతువాదభావాలను వెదజల్లిన హేతువాది, వైతాళికుడు,కవిరాజుగా ప్రసిద్ధి చెందిన  త్రిపురనేని రామస్వామి  (1887-1943) గొప్ప సంఘసంస్కర్త, స్వతంత్ర యోధుడు. తెనాలి లో వారు స్థాపించిన ' సూతాశ్రమం' అనేక సంస్కరణ ఉద్యమాలకు  కేంద్రంగా  భాసిల్లింది.  ప్రజలను   మేలుకొలిపే   హేతువాద   భావాలను   వ్యక్తపరచడానికి   సాహి...