A Special Cover 0n Kodapalli Toys by Indian Post 0n 5 - 1- 95 during the Inauguration of Philatelic Bureau, Vijayawada. The cover shows various Toys made at Kodapalli, in Krishna Dist.,A.P.The cancellation Shows the 'Cobra Sculpture'at Nagarjuna Konda.
కొండపల్లి బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు కొండపల్లి,విజయవాడ కు సమీపం లో ఉంది. ఈ బొమ్మలు తేలికైన పొనికి అనే చెక్క తో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు చిత్రి పొట్టు, చింత గింజల నుండి వచ్చిన పొడి తొ కావలసిన ఆకారములొ మలుస్తారు. బొమ్మలకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. తరువాత వాటికి సున్నం పూసి ఎండపెడతారు. ఆ తరువాత ఆరిన సున్నం పై రంగులు పూస్తారు. కొండపల్లి బొమ్మలలొ ప్రసిద్ధి చెందినవి ఏనుగు అంబారి -మావటివాడు,నాట్యం చేస్తున్న నృత్యకళాకారిణిల బొమ్మ, పల్లెలలొ తలపాగా పంచె కట్టుకొన్న పురుషులు, చీరలు కట్టుకొన్న స్త్రీలు కల తెలుగు సంస్కృతి జన జీవనం, ఆంద్రుల కట్టు బొట్టు వేషదారణలను సూచించే ప్రజల బొమ్మలు ముఖ్యమైనవి.పౌరాణిక ప్రముఖులు, పక్షులు, జంతువులు, పండ్లు, కూరగాయలు, ఇళ్ళు మొదలైన ఎన్నో రూపాల్లో ఈ బొమ్మలు తయారు చేస్తారు. |
Comments