A Special cover by India Post at APPEX - 81 on 12 - 1 - 1981
The Special postal cancellation shows The last King Prathapa Rudra (1289 -1323)of Kakathiya Dynasty,Orugallu. The Cover displays, statue of Buddha at Nagaruna Konda, one of India's richest Buddhist sites,located at near Nagarjuna Sagar in Guntur /Nalgonda district,A.P.
ప్రతాపరుద్రుడు కాకతీయ రాజవంశమునకు చెందిన చివరి రాజు. రాణి రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు). రుద్రమదేవి ఈయన్నుకాకతీయ రాజ్యానికివారసునిగా చేసుకోవటానికి దత్తత తీసుకొంది.1289లో కాయస్థ సేనాని అంబదేవుని తిరుగుబాటు అణచు ప్రయత్నములో రుద్రమదేవి మరణించగా ప్రతాపరుద్రుడు సింహాసనమధిష్ఠించాడు. ప్రతాపరుద్రుడు రాజ్యాన్ని విస్తరించి రాజ్యపాలనలో పెక్కు సంస్కరణలు చేశాడు. ఈతని కాలములో వ్రాయబడిన "సరస్వతీ విలాసము" అను గ్రంథములో హిందూ ధర్మములు, ఆచారములు, ఆస్తి హక్కులు మొదలగు చట్టములు క్రోడీకరించబడినవి. పెక్కు గ్రామాలకు నీటి వసతి కొరకు చెఱువులు తవ్వించాడు. వీటిలో బయ్యారము చెరువు ప్రసిద్ధమైనది
ఢిల్లీసుల్తాన్ ఘియాజుద్దీన్ తుగ్లక్ తన కొడుకు ఉలుఘ్ ఖానును ఓరుగల్లుపై దండయాత్రకు పంపగా ఆ యుద్ధం లో ప్రతాప రుద్రుడు ఒడి పోయాడు. ప్రతాప రుద్రుడు వారికి బందీగా చిక్కి ఢిల్లీ కి తరలిస్తుండగా మార్గ మద్యమం లో మరణించటం తో కాకతీయ సామ్రాజ్యం పతనం అయింది.
Comments