Special cover Issued by Indian Post on ETHIPOTHALA Waterfalls, A.P.
at NALPEX-2007
Date of Issue :14-03-2007
నల్గొండ జిల్లా తపాల బిల్లల ప్రదర్శన(NALPEX-2007) సందర్బంగా నాగార్జన సాగర్ కు సమీపం లో ఉన్న ఎత్తిపోతల జలపాతం పై ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసారు. ఈ ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ నుండి మాచర్ల మార్గంలో 11 కిలోమీటర్ల దూరములో గుంటూరు జిల్లా తాళ్ళపల్లె వద్ద ఉన్నది. 70 అడుగుల ఎత్తున్న ఈ జలపాతము కృష్ణా నది ఉపనది అయిన చంద్రవంక నదిపై ఉన్నది. చంద్రవంక నది నల్లమల శ్రేణుల తూర్పు కొండలలో ముటుకూరు వద్ద పుట్టి, తుమృకోట అభయారణ్యములో తాళ్ళపల్లె వద్ద 70 అడుగుల నుండి ఎత్తు నుండి పడి ఉత్తరదిశగా ప్రయాణించి, తుమృకోటకు వాయువ్యాన కృష్ణానదిలో కలుస్తున్నది. ఇక్కడ మొసళ్ళ పెంపక కేంద్రం ఉంది.
Comments