Special Cover by Indian Post on Pioneers of Indian Film Industry --Smt. P.Kannamba (1912-1964)
Date of Issue : 21- 7 -2005
ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న కన్నాంబ పూర్తి పేరు పసుపులేటి కన్నాంబ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో 1912 లో జన్మించిన కన్నాంబ ఆనాటి నావెల్ నాటక సమాజంలో పదమూడు సంవత్సరాల వయస్సులో బాల పాత్రలు వేస్తూ తొలిసారిగా నాటక రంగ ప్రవేశం చేసింది. తన నాటకరంగానుభవంతో 1935లో హరిశ్చంద్ర తెలుగు చలన చిత్రంలో ' చంద్రమతిగా అడుగు పెట్టింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణంలో "ద్రౌపది"గా అధ్బుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలను, ప్రశంసలను అందుకుంది. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త కడారు నాగభూషణం, ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు తెలుగులోను , తమిళ, కన్నడ భాషలలోను నిర్మించారు.
మహానటి కన్నాంబ ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్ర, పాదుక, చంద్రిక, కనకతార, పల్నాటి యుద్ధం, గృహలక్ష్మి , అనార్కలి, దక్షయజ్ఞం ,తోడికోడళ్ళు తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి. ఎం.జి.రామచంద్రన్, శివాజీగణేశన్, నాగయ్య, నందమూరి తారక రామారావు,అక్కినేని తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది. కన్నాంబ గారి గౌరవార్దం చెన్నై లో ౨౭-౦౭-౨౦౦౫ లో తపాల శాఖ ఒక ప్రత్యేక కవరు విడుదల చేసింది.
Comments