Two Special covers on KARPEX-2006
ELGANDAL QUILLA,Karimnagar Dist.,A.P.
Date of Issue: 7-1-2006
Spcial cover on - 'Silver Filgree Plate'
Date of Issue: 8-1-2006
కరీంనగర్ లో 2006 జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శనలో ఆ జిల్లా ప్రాముఖ్యతను తెలిపే రెండు ప్రత్యేక కవర్లు విడుదల చేసారు. ఒక దానిపైన ఎలగందల్ ఖిల్లా (కోట) ,మరొక దానిపై వెండితో తయారుచేసే అందమైన కంచం ముద్రించారు.
ఎలగందల్ కోట
కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు వంటి ఐదుగురు రాజవంశీయులు పాలనలో ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న కోట 'ఎలగందల్ కోట' . ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది
Comments