మహాకవి , తెలుగు తేజం శ్రీ శ్రీ గారి శత జయంతి ఉత్సావాలు రాష్ట్రమంతా ఘనంగా జరుగుతూ ముగింపుకు వచ్చాయి . ఆ మహాకవికి నివాళి గా భారత తపాల శాఖా ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేయక పోవటం చాల శోచనీయం . మన రాష్ట్ర ప్రభుత్వం గాని , శ్రీ శ్రీ శత జయంతి జరుపుతున్న అభిమాన సంస్థలు గాని పోస్టల్ స్టాంప్ విడుదల చేసేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి . ఆకాశ వీధుల్లో హడావుడిగా వెళ్ళే తెలుగు కవిత్వాన్ని భూ మార్గం పట్టించిన మహా కవికి ప్రత్యేక తపాల బిళ్ళ విడుదల చేసేలా మనం కృషి చేయాలి . ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఫిలాటాలి క్లబ్స్ వారు దీనికి పూనుకోవాలి . అలాగే ప్రాంతీయ పరిధిలో శ్రీ శ్రీ గారికి ప్రత్యేక కవరు , క్యాన్సిలేషన్ తో విడుదల చేసి వారికి ఘనంగా నివాళి ఇవ్వాలి . మన పొరుగున ఉన్న తమిళ వాళ్ళ ఫిలాటాలి క్లబ్స్ చూసి మన సంఘాలు ఉత్తేజం పొందుతారని ఆశిద్దాం . శ్రీ శ్రీ గారి చిత్రం శ్రీ ధరణీ రాయ్ చౌదరి సౌజన్యం తో .....
తపాల బిళ్ళ పై తెలుగు వెలుగులు : తెలుగు వారిలో తపాల బిళ్ళల సేకరణ లో అబిరుచి పెపొందించేందుకు, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు తపాల బిల్లలపై ముద్రించేలా ఈ బ్లాగు తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది.