Skip to main content

Posts

మై స్టాంప్ - వ్యకిగత తపాలాబిళ్ళ

తపాల బిళ్ళ పై సాదారణంగా జాతీయ నాయకులు, ప్రసిద్ది పొందిన కవులు,కళాకారులు, క్రీడాకారులు బొమ్మలు మాత్రమే ఉంటాయి . అయితే కొద్దిగా మార్పు తో సామాన్యులు సైతం తమ బొమ్మను (బ్రతికి ఉన్నప్పుడే) తపాలా బిళ్ళ పై చూచుకునే అవకాశం వచ్చింది. తపాలా బిళ్ళల సేకరణ పై అభిరుచి పెంచటానికి మన తపాలా శాఖ 'My Stamp'  పేరుతో తొలిసారి 2011 లో డిల్లీ లో జరిగిన అంతర జాతీయ తపాలా బిళ్ళల ప్రదర్శన లో వ్యకిగత తపాలా బిళ్ళలు విడుదల చేసింది. దానికి కొనసాగింపుగా  భారత తపాలా శాఖ 23-8-2013 నుండి విజయవాడ లో కొత్తగా ' మై స్టాంప్ ' (నా తపాలాబిళ్ళ)  పేరుతో వ్యక్తుల అభీష్టం మేరకు వారు కోరుకున్న చిత్రం తో తపాలా బిళ్ళలు విడుదల చేయాటానికి శ్రీకారం చుట్టింది. తమ బొమ్మతో 5 రూపాయల విలువగల 12 తపాలా బిళ్ళల గల ఈ మై స్టాంప్ షీట్ ను   300 రూపాయలకు విజయవాడ ప్రధాన తపాలా కార్యాలయం లో పొందవచ్చు. 17 రకాల తపాలా బిళ్ళల కాంబినేషన్ తో ఈ 'మై స్టాంప్' షీట్స్ లబిస్తాయి. ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు పత్రం మరియు పోటో తీసుకొని వెళ్లి ఈ తపాలా బిళ్ళను పొందవచ్చు.  మై స్టాంప్ నమూనా చిత్రం 

జై హింద్ -15 ఆగష్టు 1947

మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటి సారిగా తపాల బిళ్ళను 1947 నవంబర్ 21 న  విడుదల చేసారు. దానిపై మన  జాతీయ జండా తో పాటు ' జై  హింద్ ' అనే నినాదం హిందీలోను  -15 AUG 1947 అని ముద్రించ బడినాయి. ఆ తరువాత డిసెంబర్ 15 న మరో రెండు తపాల బిళ్ళలు ముద్రించారు. వాటిపై మన జాతీయ చిహ్నం (సారానాథ్ లోని  అశోక స్థంబం పై ఉన్న నాలుగు సింహాల బొమ్మ) మన స్వేచ్చకు గుర్తుగా నింగిలో విహరించే విమానం ముద్రించ బడినాయి.     INDIAN NATIONAL FLAG DATE OF ISSUE :21 -11 -1947  National Emblem of India - The Lion Capital of Asoka  DATE OF ISSUE :15 -12 -1947  Indian   Airplane. DATE OF ISSUE :15 -12 -1947    

కడప లో తపాల బిళ్ళలు మరియు నాణెలు ప్రదర్శన

NUPHILEX -KADAPA , 26,27,28 JULY 2013    GNPS -  (Guntur Numismatic and Philatelic Society)   గుంటూరు వారి నిర్వహణతో 2013 జూలై 26,27,28 తేదిలలో కడప పట్టణం  లో తపాల బిళ్ళలు మరియు నాణెలు ప్రదర్శన జరుగుతుంది. కడప లోని TTD  కళ్యాణ మంటపం, మద్రాస్ రోడ్ లో  మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలోఅరుదైన  వివిధ దేశాల తపాలా బిళ్ళలు మరియు నాణెలు, కరెన్సీ నోట్లు ప్రదర్శించ బడతాయి. ప్రవేశం ఉచితం. ఈ సందర్బంగా పాటశాల విద్యార్దులకు వివిధ అంశాలలో పోటీలు కుడా నిర్వహిస్తున్నారు.  తపాలా బిళ్ళలు, నాణేల సేకరణ కర్తల కొరకు  స్టాంప్స్ మరియు కాయిన్ డీలర్స్ 20 పైగా స్టాల్ లు ఏర్పాటు చేసినట్లు GNPS  కార్యదర్శి శ్రీ ప్రసాద్ తెలియ జేస్తున్నారు. 

శ్రీలంక తపాలా బిళ్ళ పై స్వామి వివేకానంద

స్వామి వివేకానంద 150 వ జయంతి సందర్బంగా శ్రీలంక  తపాలా శాఖ వారికి ఘన నివాళి గా 7-6-2013 న ఒక  ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది. Swami Vivekanda - Sri Lanka Swami Vivekanada-Sri Lanka- Fdc వివేకానందునికి నివాళిగా ఇంతకు ముందు కుడా శ్రీలంక ప్రభుత్వం15-01-1997 లో  ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది.  Swami Vivekanada- Visit to Sri Lanka Swami Vivekanada- Visit to Sri Lanka- FDC మన తపాల శాఖ వారు ఇంతకు ముందు స్వామి వివేకానంద పై వివిద సందర్బాలలో విడుదల చేసిన  తపాలా బిళ్ళల ను చూడటానికి ---   స్వామి వివేకనంద -1 , swami vivekanda-2

Centenary Celebrations of First Andhra Conference

On the occation of the centenary celebrations of First Andhra Conference (`Pradhama Andhra Mahasabha’) India Post released a Special Postal cover  on 24-5-2013 at the historic Town Hall ,at Bapatla, Andhra Pradesh.  Union Minister of State for Petroleum and Natural Gas Panabaka Lakshmi inaugurated the event by hoisting a flag and released a Special Postal Cover   marking the historic event. ప్రధమాంధ్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు 1913 లో బాపట్ల లో 'ఆంద్ర  మహాసభ' తొలి సమావేశం జరిగింది. దానిని పురస్కరించుకొని ప్రధమాంద్ర మహాసభ - శతాబ్ది ఉత్సవాలు బాపట్ల లోజరిగిన సందర్బం గా మే 24 , 2013 న మన తపాలా శాఖ(విజయవాడ) ఒక ప్రత్యక తపాలా కవర్ ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక కవర్ పై ప్రధమాంద్ర మహాసభ లోగోను దానిపై  క్యాన్సిలేషన్ కొరకు ఆంధ్ర మహాసభ జరిగిన బాపట్ల టౌన్ హాల్ చిత్రం తో ప్రత్యక తపాలా ముద్ర ను రూపొందించారు ప్రత్యేక తపాల కవర్ విడుదల చేస్తున్న కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి  తదితరులు  బాపట్ల-టౌన్ హాల్  తెలుగు వారిక...

అంతరించి పోతున్న అడవి గాడిదలు

గుజరాతు లో కుచ్చ్  ప్రాంతం లో ఉన్న ఘోర్ ఖర్, లడక్ లో సంచరించే కయాంగ్ జాతి గాడిదలు మన దేశం లోఅంతరించి పోతున్న అడవి గాడిదలు. వీటిని కాపాడటానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.  భారత తపాలా శాఖ 10-5-2013 న వీటి పై రెండు తపాలా బిళ్ళలు(Rs5/- ,Rs20/-) మరియు ఒక మినిఎచర్ ను విడుదల చేసింది.  అడవి గాడిదల పాటు మన దేశ వాళీ గాడిదలు కుడా త్వరలో కనుమరుగై స్థితి లో ఉన్న పరిస్థితులలో వీటిని సంరక్షించు కోవలిసిన భాద్యత పర్యావరణ పరిరక్షకులందరి పైన ఉంది.   India Post released a set of 2 stamp and Miniature Sheet on the    endangered Indian Wild Ass of Kutch and Ladakh on 10th May 2013.  The Stamps depict the Kiang ( Ladakh) and Ghor Khar ( Kutch, Gujarat) Ass on the face value of Rs.5/- and Rs.20/- stamps. Wild Ass of Kutch and Ladakh -M.S  Wild Ass of Kutch and Ladakh- Fdc 

తపాల బిళ్ళల పై S. V. రంగారావు , భానుమతి, అల్లు రామలింగయ్య

వందేళ్ళ సినిమా కి వందనం  మన భారత చలన చిత్ర రంగానికి వందేళ్ళ నిండిన శుభవేళ మన తపాలా శాఖ 3-5-2013 న భారత చలన చిత్ర రంగానికి విశిష్ట సేవలు అందించిన 50 మంది ప్రముఖులకు ఒకే సారి 50 తపాలా బిళ్ళలు విడుదల చేసింది. ఇంత వరకు ప్రపంచం లో ఏ దేశం ఇలా ఒకే సారి ఇన్ని తపాలా బిళ్ళలు విడుదల చేయ లేదు. ఈ తపాల బిళ్ళ ల పై పాల్కే అవార్డ్స్ పొందిన 18 సినీ ప్రముఖులతోపాటు మరో 32 మంది వివిధ రంగాలలో కృషి చేసిన సినీ కళాకారులు ఉన్నారు .  మన తెలుగు చిత్ర రంగానికి సంబందించి ఈ అరుదైన గౌరవం  ముగ్గురు నటులకు మాత్రమే లభించింది.  ఈ తపాల బిళ్ళల పై ఉన్న మన తెలుగు తారలు  S. V. రంగారావు ,  భానుమతి,  అల్లు రామలింగయ్య   ఎస్వీ రంగారావు (1918-1974) సామర్ల వెంకట రంగారావు   - SVR గా తెలుగు చిత్ర సీమలో పేరొందిన   నటుడు.  మూడు దశాబ్దాలపాటు మూడొందల పైగా సాంఘిక పౌరాణిక సినిమాలలో  అద్భుతంగా నటించిన సహజ నటుడు.   ఘటోత్కచుడిగా ,  కీచకుడిగా ,  రావణాసురుడిగా  తనకు తానే సాటిగా ప్రేక్షకుల మన్నలను గడించాడు. ...