రైతుల లోగిళ్ళలో సంబురంగా జరిగే సంక్రాంతి (పొంగల్) పై శ్రీ లంక దేశం 2014 లో రెండు తపాల బిళ్ళలు ఒక మినియెచర్ విడుదల చేసింది.
Pongal -Sri Lanka |
మన దేశంలో ఈ పండుగకు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తించిన మన తపాల శాఖ కుడా ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను 12-1-2006 న విడుదల చేసింది.
PONGAL - HARVEST FESTIVAL, Date of Issue: 12-1-2006 |
సంక్రాంతి
తెలుగు వారికి అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఆంధ్ర ప్రదేశ్ లో ఇది రాష్ట్ర పండుగగా ప్రకటించారు.
రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి రైతుల పండుగగా దీన్ని అభివర్ణిస్తారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక లలో సంక్రాంతి అని, తమిళనాడు లో పొంగల్ అని,మహారాష్ట్ర, గుజరాతు లలో మకర్‌సంక్రాంతి అని, పంజాబు, హర్యానా లలో లోరీ అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు.
పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు.
పండుగ జరుపుకునే మూడు రోజులలో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.

ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. కళ్లం నుంచి బళ్ల మీద ధాన్యం బస్తాలు వస్తూ ఉంటాయి.
భోగినాడు భోగిమంటలు,బొమ్మల కొలువులు, పిల్లలకు భోగిపళ్లు వంటి వాటితో తెలుగు లోగిళ్ళు సందడిగా ఉంటాయి.
ఈ పండుగకు వచ్చిన కొత్త అల్లుడు ని 'బావా ,బావా పన్నీరు,బావను పట్టి తన్నేరు' ... అంటూ మరదళ్ళు చేసే ఎకసెక్కాలకు ఆట పాటలకు ,సరదాలకు,పిండి వంటలు ముఖ్యంగా అరెసలు ఈ పండగ ప్రత్యేకత.
గంగిరెద్దులు,హరి దాసులు,పగటి వేషగాళ్ళు,ఆటల పోటీలు, పశువుల పందేలు,కోడి పందేలు ... ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు.

Comments