మన భారత తపాలా శాఖ 1-11-2017 న ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర ఆలయం పైన ఒక తపాలా బిళ్ళను విడుదల చేశారు. దీనితో పాటు ఆదికవిగా కీర్తించబడిన నన్నయ్య పై కూడా ఒక తపాలా బిళ్ళను విడుదల చేశారు.
ఇంతకు ముందు ప్రసిద్ది చెందిన ఈ దేవాలయం పై తూర్పు గోదావరి జిల్లా తపాలా బిళ్ళలు ,నాణెం సేకరణ కర్తల సౌజన్యం తో తపాల శాఖ వారు ఒక ప్రత్యక తపాలా కవరు ను 30- 7- 2005 విడుదల చేసారు.
SPECIAL COVER BY INDIAN POST ON DRAKSHARAMA BHIMESWARA TEMPLE (A .P.)
Date of Issue : 30- 7- 2005
|
పంచారామాలలో ఒకటి అయిన ఈ ద్రాక్షారామ భీమేశ్వరాలయం తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రాపురం మండలంలో ఉంది. ఇక్కడ భీమేశ్వరస్వామి లింగాకారం లో ఉన్నాడు. లింగం సగభాగం నల్లగా, సగభాగం తెల్లగా ఉంటుంది.ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తు ఉంటుంది.
ఈ ఆలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథకవి తన భీమేశ్వర పురాణంలో వివరించాడు.
Comments