Skip to main content

Posts

అల్లూరి సీతారామరాజు స్మృతి మందిరం , కృష్ణ దేవిపేట

Aluri Raju's tomb in Krishna Devi Peta village. AP. India Post released a special cover on Alluri Sitharamaraju memorial at Krishna Devipeta, A.P on 23 rd August 2021 With respect to many unsung Indian heroes of our prolonged battle against the British colonial rule in the past, Alluri Sitarama Raju, a great and daring revolutionary is one among them. His spirited and vital role in the Rampa rebellion of 1922–24 has carved a permanent niche for him in the pages of Indian history of freedom struggle.Alluri Raju's tomb is in Krishna Devi Peta village in Visakhapatnam district. భారత తపాల శాఖ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మృతి మందిరం , కృష్ణ దేవిపేట పై ఒక ప్రత్యేక కవరును 23 ఆగస్టు 2021న విడుదల చేసింది. 23 ఆగస్టు 1922 లో కృష్ణదేవి పేట పోలీసు స్టేషన్ పై అల్లూరి దాడి  చేసి అక్కడ ఉన్న ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాడు. కృష్ణ దేవిపేట లో అల్లూరి సమాధిని నిర్మించారు.   

రంప తిరుగుబాటు శాతాబ్ది ఉత్సవాలు

India Post released a set of  two special covers on Rampa Revolution led by Alluri Sitharamaraju on 16th March 2022 at Addatigala and Rampa Chodavaram in Andhra pradesh.  అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన  రంప తిరుగుబాటు శాతాబ్ది ఉత్సవాల సందర్భంగా 16 మార్చ్ 2022 న రెండు అందమైన ప్రత్యేక కవర్లు విడుదల చేసారు.  అల్లూరి ముఖ్య అనుచరులు గాం మల్లు దొర మరియు  బొనంగి పాండు పడాలు   పై వీటిని విడుదల చేసారు. బ్రిటిష్ వారికి ముందస్తు దాడి సమాచారాన్ని మిరపకాయ టపా (Chilli Post) ద్వారా తెలిపేవారు. కవరుపై వారి చిత్రాలతో పాటు దీన్ని ముద్రించారు. వీటిపై  రామరాజు దాడి చేసిన అడ్డతీగెల, రంప చోడవరం పోలీస్ స్టేషన్స్ ఉన్న తపాలా ముద్రతో క్యాన్సిల్ చేసారు.   

వైభవంగా ముగిసిన APPEX - 22

విశాఖపట్నం లో 2022 నవంబరు 23,24,25 తేదీలలోజరిగిన రాష్ట్రస్థాయి తపాలాబిళ్ళల పోటీ ప్రదర్శన APPEX - 22 ( 13th Andhra Pradesh State level Philately exhibition ) ద్విగ్విజయంగా ముగిసింది. నవ్యఆంధ్ర లో తొలిసారి జరిగిన ఈ తపాలా ప్రదర్శనలో  మన ఆంధ్రప్రదేశ్ లోని 109 మంది తపాలా బిళ్ళల సేకరణ దారులు షుమారు  320 ఫ్రెములలో 5200 పైగా షీట్స్ లో వేలాది తపాలాబిళ్ళలను ప్రదర్శించారు.  దీనిలో పాల్గొని  నేను  ( కొడాలి శ్రీనివాస్)   ఐదు ఫ్రెములలో 80 షీట్స్ తో  ప్రదర్శించిన " Indian's  Struggle for Freedom" కు సిల్వర్ బ్రాంజి మెడల్ వచ్చింది. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ అవతరించిన తరువాత జరిగిన రాష్ట్ర స్థాయి తపాలబిళ్ళల ప్రదర్శన Appex 22.  అన్ని రాష్ట్ర లలో ఇలా పోటీలు జరుగుతాయి. వీటిలో ఉత్తమ పతకాలు వచ్చిన ఫిలాటలిస్టులతో  (2023, ఫిబ్రవరి 11  నుండి 15) దేశ స్థాయిలో అమృత ఫెక్స Amurtpex - 23 ఢిల్లీ లో జరుగుతుంది.  జ్ఞానాభిలాష కు తపాలబిళ్ళల సేకరణ ఒక మార్గం.  ఇది  మంచి అభిరుచి. ఈనాటి తరానికి దీని గురించి తెలియదు. నేటి విద్యార్థులకు,యువతకు దీన్ని పరిచయం...

మన జాతీయ జండా పరిణామక్రమం

మన  జాతీయ జండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారి జయంతి సందర్బంగా 2ఆగష్టు 2022 న మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన తపాల బిళ్ళల ప్రదర్శన లో నేను మన స్వతంత్ర పోరాటం గురించిన తపాళా బిళ్లలను ప్రదర్శించాను. ఈ సందర్బంగా వెంకయ్య గారిపై ఒక ప్రత్యేక కవరు విడుదల చేసారు. అలాగే కేంద్ర తపాల శాఖ మన 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా   జాతీయ జండా పరిణామక్రమం పై 75/-రూపాయల ఒక మినియేచరును విడుదల చేసింది. Journey of the National Flag

STAMP ISSUE CALENDAR - 2021

భారత తపాలా శాఖ 2021లో విడుదల చేసిన తపాలా బిళ్ళలు   మొత్తం  తపాల బిళ్ళలు = 16 ముఖ విలువ = రూ 127 /- Sl.No Stamp Name Release Date 1 125th Birth Anniversary Year of Netaji Subhas Chandra Bose -  Rs.25/- 23-01-2021 2 50 Years of full Statehood of Himachal Pradesh - Rs.5/- 25-01-2021 3 The High Court of Gujarat- Rs.5/- 06-02-2021 4 100 Years of First Visit of Mahatma Gandhi to Odisha- Rs.5/- 23-03-2021 5 Golden Jubilee Year of India Bangladesh Friendship - Rs.5/- 27-03-2021 6 Rajyogini Dadi Janki  - Rs.5/- 12-04-2021 7 70 Years of Diplomatic Relations between India and Germany - Rs.25/- 10-06-2021 8 Golden Jubilee Year-Gayatri Teerth,Shantikunj - Rs.5/- 20-06-2021 9 Ma. Chaman Lal - Rs.5/- 07-08-2021 10 Rao Jaimal Rathore - Rs.5/- 17-09-2021 11 Martyrs of Solapur namely "Mallappa Dhanshetti, Shrikisan Sarada, Jagannath Shinde and Abdul Rasul - Rs.5/-   02-10-2021 12 Deccan College Bicentenary - Rs.5/- 06-10-2021 13 Dattopant Thengadi - Rs.5/- 10-11-2021 14...

Netaji 125th Birth Anniversary

నేతాజీ సుభాష్ చంద్రబోస్ (జననం జనవరి 23, 1897) గారి 125వ జన్మదినం సందర్భంగా మన తపాలా శాఖ ఒక ప్రత్యేక తపాల బిళ్ళను 23- 01 - 2021 న విడుదల చేసింది.  నేతాజీ గా ప్రసిద్ధి గాంచిన సుభాష్ చంద్ర బోసు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. బోసు రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీతో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. మహాత్మాగాంధీ అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, తెల్లవాళ్ళ పై పోరాటం ద్వారానే మనకు స్వతంత్రం వస్తుందని తలంచి, రెండవ ప్రపంచ యుద్ధం లో జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం(I.N.A) ను ఏర్పాటు చేశాడు. జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్ధిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వం ను సింగపూర్ లో ఏర్పరచాడు. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా కరెన్సీ, తపాలా బిళ్ళలు, న్యాయ మరియు పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అక్ష రాజ్యాలైన జర్మనీ, జపాన్,ఇటలీ, క్రొయేషియా, థాయ్‌లాండ్, బర్మా, ఫిలిప్ఫీన్స్ దేశాలు కూడా ఆమోదించాయి. నేతాజీ ఆగస్టు 18, 1945 లో తైవాన్ మీదుగా టోక్యోకు  ప్రయాణిస్తుండగా విమాన ప్రమాద...

First Visit of Mahatma Gandhi to Odisha

India post released a Commemorative Postage Stamp on 100 Years of First Visit of Mahatma Gandhi to Odisha on 23rd March 2021. The First Day Cover of the Commemorative Postage Stamp portrays the Swaraj Ashram at Cuttack, where Mahatma Gandhi stayed during his first visit to Odisha on 23rd March 1921.